Nara Rohit Prathinidhi 2: కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు నారా రోహిత్(Nara Rohit). దీంతో నారా వారి ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడినట్లయింది. ఈ హీరో చివరిసారిగా ‘'వీరభోగ వసంతరాయలు'’ అనే చిత్రంలో నటించాడు. తాజాగా ఓ పొలిటికల్ టచ్ ఉన్న మూవీతో రాబోతున్నాడు. గతంలో నారా రోహిత్ చేసిన 'ప్రతినిధి' సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. దీనికి 'ప్రతినిధి 2' (Prathinidhi 2) అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్.
రీసెంట్ గా ఈ చిత్ర నుంచి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో నారా రోహిత్ శరీరమంతా వార్తాపత్రికలను చుట్టుకుని చేయి పైకెత్తి ఉంటాడు. తాజా లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘''అన్ని అసమానతలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి మళ్లీ నిలబడతాడు''’ అంటూ ఆ పోస్టర్‌పై ఓ క్యాప్షన్ కూడా రాశారు. ఈ మూవీకి ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. వానరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా నాని చమిడిశెట్టి వ్యవహారిస్తున్నారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ చేయనున్నారు.
Also Read: Deepika Pilli: దీపికా పిల్లి ముద్దు ఎవరి కోసమో..! కూల్ వెదర్‌లో వేడి పుట్టిస్తున్న బుల్లితెర భామ
నారా రోహిత్ కెరీర్ కు మాంచి ఊపు తెచ్చిన సినిమాల్లో ప్రతినిధి ఒకటి. 2014లో రిలీజైన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మంచి విజయం సాధించింది. ఈ మూవీలో హీరో రోహిత్ సీఎంను కిడ్నాప్ చేసి వ్యవస్థను మార్చాలనుకునే యువకుడిగా కనిపించాడు. అయితే ఆ చిత్రానికి ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook