Ganga Dussehra 2023: గంగా దసరా పండుగను జ్యేష్ఠ శుక్ల పక్ష దశమి రోజున జరుపుకుంటారు. ఈ రోజునే గంగ భూమిపైకి ఉద్భవించిందని హిందువుల నమ్మకం. గంగా దసరా రోజు గంగా స్నానాన్ని ఆచరించి..దానధర్మాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని పూర్వీకుల నమ్మకం. అంతేకాకుండా ఈరోజు స్త్రీలు గంగాదేవిని పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గంగా దసరా పండగ ప్రత్యేకత ఏంటో? ఈరోజు ఏ నియమాలతో పూజా కార్యక్రమాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గంగా దసరా రోజున భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లిని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. దీనికోసం మీరు ఒక గిన్నెలో నెయ్యిని అద్ది అందులో నువ్వులు, బెల్లాన్ని వేసి ప్రవహిస్తున్న గంగలో వాటిని వదలాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత పదిమంది బ్రాహ్మణులకు వస్త్రాలతో పాటు పండ్లను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం లభిస్తుంది. అంతేకాకుండా ఈ పండగ రోజున చాలా మంది శివుడిని కూడా పూజిస్తారు.
నది స్నానం చేయలేని వారు ఇలా చేయాలి:
✵ మీ దగ్గరలో గంగా నది లేకపోతే.. ఇంట్లోనే చల్లని నీటితో స్నానం చేయాల్సి ఉంటుంది.
✵ ఈ చల్లని నీటిలో ప్రవహిస్తున్న గంగా నుంచి తీసుకువచ్చిన నీటిని కలుపుకోవాలి.
✵ స్నానం చేసిన తర్వాత పట్టు వస్త్రాలను ధరించి గంగా ధ్యానం చేయాలి.
✵ ఆ తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేసి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది.
గంగా దసరా శుభ సమయం:
✵ జ్యేష్ఠ దశమి తిథి ప్రారంభం: 29 మే (నిన్న) ఉదయం 11.49 గంటలకు..
✵ దశమి తిథి ముగుస్తుంది: 30 మే ఈరోజు మధ్యాహ్నం 01:07 గంటలకు..
✵ హస్తా నక్షత్రం ప్రారంభం: 30 మే ఈరోజు ఉదయం 04.29 గంటల నుంచి..
✵ హస్తా నక్షత్రం ముగింపు: 31 మే రేపు ఉదయం 06 గంటల వరకు
✵ స్నాన దానం సమయం: ఈరోజు ఉదయం 04:03 నుంచి సాయంత్రం 04:43 వరకు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook