Sun Transit in Rohini Nakshatram: జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు రాశి పరివర్తనం చెందినట్టే నక్షత్ర గోచారం కూడా చేస్తుంటాయి. మే 25వ తేదీన గ్రహాల రారాజు సూర్యుడు రోహిణీ నక్షత్రంలో ప్రవేశించాడు. ఈ సందర్భంగా కొన్ని రాశుల జాతకులకు విశేషమైన లాభాలు కలగనున్నాయి. కెరీర్ అద్భుతంగా ఉంటుంది. డబ్బుల వర్షమే కురవనుంది.
సూర్యుడు ప్రతి నెలా ఓ రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశుల జీవితాలపై పడనుంది. మే 25వ తేదీన సూర్యుడు చంద్రుడి నక్షత్రమైన రోహిణిలో ప్రవేశించనున్నాడు. దాంతో కొన్ని రాశులపై పాజిటివ్ పరిణామాలు కలగవచ్చు. సూర్యుడి నక్షత్ర పరివర్తనంతో 5 రాశులవారికి అమితమైన లాభాలు కలగనున్నాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి 6వ పాదంలో ఉండటంతో ఆ వ్యక్తి కెరీర్‌పరంగా పటిష్టమైన లేదా ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. అంతేకాదు..ఈ రాశి జాతకులు కష్టపడటం నుంచి వెనుకంజ వేయరు. మీ ప్రయత్నాలు కొనసాగించాలి. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త వహించాలి.
జ్యోతిష్యం ప్రకారం.. సూర్యుడు రోహిణీ నక్షత్రంలో ప్రవేశించనుండటంతో మేష రాశి జాతకులకు ఊహించని లాభాలు కలగవచ్చు. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో కుటుంబసభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి.
సింహ రాశి పదవ పాదంలో ఉండటం వల్ల ఈ రాశి జాతకులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. కెరీర్ కూడా చాలా బాగుంటుంది. ఆర్దిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏ విధమైన సమస్య తలెత్తదు. ఆరోగ్యపరంగా ఏ సమస్యా ఉండదు. మొత్తానికి సూర్యుడి గోచారం కారణంగా సింహరాశి జాతకులకు అనుకూలంగానే ఉండనుంది.
నృషభ రాశి జాతకులకు సూర్యుడి నక్షత్ర పరివర్తనంపై అధిక ప్రాదాన్యత ఉంటుంది. మీలో నాయకత్వ లక్షణాలుంటాయి. ఈ సమయంలో చాలామంది ఆకర్షితులౌతారు. ఏ విధమైన ఇతర సమస్యలు ఉత్పన్నం కావు. మీరు పడిన కష్టానికి గుర్తింపు ఉంటుంది. ఆర్ధికంగా ఏ సమస్యా ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది కానీ జాగ్రత్త అవసరం.
కర్కాటక రాశి జాతకులకు సూర్యుడి రోహిణి నక్షత్ర పరివర్తనం ప్రభావంతో కర్కాటక రాశివారికి ఊహించని లాభాలుంటాయి. కర్కాటక రాశి 11వ పాదంలో సూర్యుడు ఉంటాడు. ఈ క్రమంలో ఊహించని ధనలాభం నలువైపుల్నించి ఉంటుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆరోగ్య.పరంగా ఏ సమస్య తలెత్తదు.
Also Read: Venus Transit 2023: సూర్యుడి గోచారంతో లక్ష్మీయోగం, 4 రాశులకు మే 30 నుంచి మహర్దశ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook