What To Eat Cholesterol Free: శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు అధికంగా పెరగడం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ సిరలు, ధమనులలో పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణలో ఆటంకాలు ఏర్పడతాయి. దీని కారణంగా కొంత మందిలో గుండెపోటు సమస్యలు వచ్చి ప్రాణాంతంగా కూడా మారుతోంది. అయితే శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం..వంటి కారణాల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు కూడా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దీని కోసం మీరు డైట్‌లో ఈ కింది ఆహారాలు చేర్చుకోవాల్సి ఉంటుంది.
చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది:
కరిగే ఫైబర్ కలిగిన ఆహారాలు:
చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు పీచు కలిగి ఆహారాలను అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఫైబర్ అధికంగా కలిగిన పండ్లను ప్రతి రోజు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా సులభంగా కరుగుతుంది.
ఆకు కూరలు:
పోషకాలు అధిక మోతాదులో లభించే ఆకు కూరలు తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా గుండెపోటు సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తీవ్ర కొలెస్ట్రాల్, గుండె సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆకు కూరలను తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Shri Krishna Janmashtami 2023: శ్రీకృష్ణుడి వీడ్కోలు తరువాత తల్లిదండ్రులకు ఏమయ్యారు..? ఆ నలుగురు ఎలా చనిపోయారు..?
గింజలతో తయారు చేసిన వంట నూనె:
సన్‌ఫ్లవర్, ఆలివ్ ఆయిల్ నూనెలను ఆహారంలో వినియోగించడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శుద్ధి చేసిన నూనెలను ఆహారాల్లో వినియోగించడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగే ప్రమాదం కూడా తగ్గుతుంది.
గింజలను ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది:
బాదం, వాల్‌నట్, వేరుశెనగలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇందులో ఉండే గుణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా వీటిని ప్రతి రోజు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ 5 శాతం వరకు తగ్గుతుంది. దీంతో పాటు మానసిక సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి