స్థూలకాయం అనేది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణం. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతుంటుంది. అధిక బరువు నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రాత్రి నిద్రించేముందు..ఆ ఒక్క పని చేస్తే బాడీ ఫిట్‌నెస్ మీ సొంతం.
స్థూలకాయం అనేది చాలా ప్రమాదకరం. స్థూలకాయం కారణంగా వివిధ రకాల వ్యాధులు తలెత్తుతుంటాయి. డయాబెటిస్, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి ప్రమాదకర వ్యాధులు చుట్టుముడుతుంటాయి. బరువు తగ్గించుకునేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాత్రి నిద్రించేముందు..కొన్ని చిట్కాలు పాటిస్తే స్థూలకాయం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే రాత్రి వేళ శరీరం కేలరీలను బర్న్ చేస్తుంటుంది.
ఫిట్ ఉండేందుకు ఏం చేయాలి
డిన్నర్ 7 గంటలకు
బరువు తగ్గించేందుకు ప్రధానంగా డైట్‌పై శ్రద్ధ పెట్టాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. దీనికోసం రాత్రి భోజనం 7 గంటలకు పూర్తి చేసేయాలి. ఎందుకంటే రాత్రి భోజనం జీర్ణమయ్యేందుకు చాలా సమయం పడుతుంది. ఫలితంగా బరువు పెరుగుతుంటారు. అందుకే బరువు తగ్గాలనుకుంటే..రాత్రి వేళ భోజనం ఆలస్యంగా చేయకూడదు. రాత్రి భోజనానికి, నిద్రకు కనీసం 3 గంటలు విరామం ఉంటే మంచిది.
ఫైబర్ ఫుడ్స్ సేవనం
స్థూలకాయం నుంచి గట్టెక్కేందుకు రాత్రి భోజనం ఎప్పుడూ లైట్‌గా ఉండేట్టు చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి. బరువు తగ్గేందుకు డిన్నర్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తీసుకుంటే మంచిది. రాత్రి వేళ సూప్, సలాడ్, రోటీ, పప్పు వంటివి తీసుకోవాలి. దీనివల్ల మీ కడుపు నిండటమే కాకుండా..బరువు కూడా తగ్గుతారు.
వేడి నీళ్లు తాగడం
బరువు తగ్గించుకునేందుకు రాత్రి భోజనం తరువాత కచ్చితంగా వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమౌతుంది. గ్రీన్ టీ కూడా మంచిది. శరీరం మెటబోలిజం పటిష్టమౌతుంది.శరీరంలో బెల్లీఫ్యాట్ కరుగుతుంది.
Also read: Belly Fat Loss Diet: బరువు తగ్గడానికి దీని కంటే వేరే టీ ఏది లేదు.. దీంతో కొలెస్ట్రాల్ కూడా చెక్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook