Nutritionist For Weight Loss At Home: ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల శరీర బరువు పెరుగుతున్నారు. దీని కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులను దృష్టిలో పెట్టుకుని చాలా మంది తమకు తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి ఉదయాన్నే లేచి వ్యాయామాలు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా జిమ్‌లో కూడా చేరుతున్నారు. ఇవన్నీ చేసిన వారు ఫిట్‌నెస్ కోల్పోతున్నారు. అంతేకాకుండా బరువు కూడా పెరుగుతున్నారు. అయితే వీటితో పాటు డైట్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. డైట్‌లో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని డైటీషయన్స్ తెలుపుతున్నారు. అయితే శ్రమ లేకుండా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా డైట్‌లో కొన్ని రకాల ఆహారాలు చేర్చుకోవాల్సి ఉంటుంది.
పెరుగుతున్న బరువు సులభంగా డైటీషయన్స్ అందించే పెసరపప్పు డైట్‌తో తగ్గించుకోవచ్చు. దీని కారణంగా శరీర బరువు కూడా నియత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి. ఈ పప్పులో మల్టీవిటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి రోజు డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే పెసరపప్పుతో డైట్‌లో ఎలా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పెసరట్టు:
ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఇటీవలే తెలిపిన వివరాల ప్రకారం, బరువు తగ్గే క్రమంలో డైట్‌లో భాగంగా పెసరపప్పుతో తయారు చేసిన అట్టును తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారట. దీంతో పాటు ఈ అట్టును తయారు చేసే క్రమంలో కూరగాయలను వినియోగించి కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే దీనిని తయారు చేసేటప్పుడు నూనెనుకు బదులుగా నెయ్యిని వినియోగించడం చాలా మంచిది.
పెసర మొలకలు:
మొలకలు తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరానికి అద్భుతమైన శక్తిని అందిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా వ్యాయామాలు చేసేవారు ప్రతి రోజు మొలకలు తినాల్సి ఉంటుంది. వీటిల్లో పీచుపదార్థాలు ఎక్కువగా మోతాదులో లభిస్తాయి. ఇవి పొట్టను ఆరోగ్యంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు శరీర బరువును నియత్రించేందుకు కూడా సహాయపడుతుంది.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
మూంగ్ దాల్ ఖిచ్డీ:
శరీర బరువును సులభంగా నియంత్రించేందుకు ఈ మూంగ్ దాల్ ఖిచ్డీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు డైట్‌లో దీనిని చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇందులో కొన్ని మూలకాలు కొవ్వును కూడా నియంత్రిస్తాయి.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.