Breakfast Combinations for weight loss: ఈ 6 బ్రేక్‌ఫాస్ట్స్‌ కాంబినేషన్స్ తీసుకుంటే నెలలో బరువు ఈజీగా తగ్గిపోతారు..

Breakfast Combinations for weight loss: అల్పాహారం మన జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. రాత్రి పూర్తిగా 12 గంటలపాటు పొట్ట ఖాళీగా ఉంటుంది. ఆ తర్వాత ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తాం. ఈ అల్పాహారాన్ని ఎట్టిపరిస్థితుల్లో స్కిప్ చేయకూడదు.

Written by - Renuka Godugu | Last Updated : Mar 31, 2024, 08:13 AM IST
Breakfast Combinations for weight loss: ఈ 6 బ్రేక్‌ఫాస్ట్స్‌ కాంబినేషన్స్ తీసుకుంటే నెలలో బరువు ఈజీగా తగ్గిపోతారు..

Breakfast Combinations for weight loss: అల్పాహారం మన జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. రాత్రి పూర్తిగా 12 గంటలపాటు పొట్ట ఖాళీగా ఉంటుంది. ఆ తర్వాత ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తాం. ఈ అల్పాహారాన్ని ఎట్టిపరిస్థితుల్లో స్కిప్ చేయకూడదు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే, ఇది ఆరోగ్యకరంగా మీరు బరువు కూడా సులభంగా తగ్గే విధంగా కాంబినేషన్ ఉంటే మరీ మంచిది.

ఈరోజుల్లో ఒబేసిటీ సమస్య విపరీతంగా పెరిగింది. గంటలపాటు కూర్చోని పనిచేయడం, సరైన జీవనశైలి పాటించకపోవడం వల్ల ఒబేసిటీ వస్తుంది. దీనికి మంచి ఆరోగ్య నియమావళి పాటిస్తూ ఎక్సర్‌సైజులు కూడా చేయడం అవసరం. ఈరోజు మనం ఆరోగ్యకరంగా ఉంటూనే ఈజీగా బరువు తగ్గే బ్రేక్‌ఫాస్ట్స్‌ కాంబినేషన్ల గురించి తెలుసుకుందాం.

ఇడ్లి చట్నీ..
ఇది సౌత్‌ ఇండియన్ స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్‌. మీరు బరువు తగ్గడానికి కూడా బెస్ట్‌ అల్పాహారం. ఇడ్లిని నూనె లేకుండా ఆవిరి ద్వారా ఉడికించుకుంటాం. ఇందులో కొద్దిపాటి కొవ్వులు, కేలరీలు ఉంటాయి. సాంబార్ పప్పులతో చేస్తారు. ఇందులో మంచి ప్రొటీన్‌, ఫైబర్ ఉంటుంది. చట్నీ కొబ్బరి, బాదంలతో తయారు చేస్తారు. ఇందులో మంచి సువాసనతోపాటు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

ఓట్స్, బెర్రీ..
ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వదు. దీంతో బరువు సులభంగా తగ్గిపోతారు. దీన్ని యోగర్ట్‌తోపాటు తీసుకుంటే మెటాబాలిజం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంద.ఇక బెర్రీల్లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇదీ చదవండి: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ప్రతిరోజు అల్పాహారంలో వీటిని తీసుకోండి చాలు..

పోహా, మొలకెత్తిన గింజలు..
పోహాలో ఎక్కువ మొత్తంలో ఐరన్, ఫైబర్ ఉంటుంది. మొలకెత్తిన గింజల్లో ప్రొటీన్స్, విటమిన్స్ ఉంటాయి. దీంతో బరువు సులభంగా తగ్గిపోతారు. ఈ ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ లో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లతో సమతుల శక్తిని అందిస్తుంది.

దలియా, కూరగాయలు..
దలియాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచిది.దలియాలో విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. ఇందులో వెజిటేబుల్స్ కూడా వేసుకుంటాం కాబట్టి ఇది మనకు రోజంతటికీ కావాల్సిన శక్తినిస్తుంది.

ఇదీ చదవండి:  ఆరోగ్యాన్నిచ్చే అక్రోట్లు.. డైలీ ఇలా తింటే మీ శరీరంలో బిగ్ మిరాకిల్..

ఎగ్ వైట్‌ ఆమ్లెట్, గోధుమ బ్రెడ్‌..
ఎగ్ వైట్‌ లీన్ ప్రొటీన్ కలిగి ఉంటుంది.  గోధుమ బ్రెడ్‌ లో ఫైబర్‌, కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్‌ ఉంటాయి. ఈ కాంబినేషన్ కూడా బరువు తగ్గడానికి చాలా బెస్ట్‌.

క్వినోవా ఉప్మా..
క్వినోవా సూపర్ ఫుడ్. ఇందులో ప్రొటీన్, ఫైబర్‌ , అధిక శాతంలో అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఉప్మాను కూరగాయలు కలిపి వండుతారు. కాబట్టి ఇవి ఎంతో ఆరోగ్యకరం. అంతేకాదు ఇది గ్లూటెన్ ఫ్రీ ఇందులోని న్యూట్రియేంట్లు బరువు తగ్గడానికి ప్రేరేపిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News