Pumpkin juice For Weight loss: భారతీయులు గుమ్మడికాయతో వివిధ రకాల రెసిపీలను తయారు చేసుకుంటారు. ఇలా తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో విటమిన్ సి, బి1, బి3తో పాటు ఇతర అనేక పోషకాలు లభిస్తాయి. దీనితో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రతి రోజు గుమ్మడికాయ రసాన్ని తాగడం వల్ల ఎముఖల సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా సహాయపడతాయి. ఈ రసంలో ఫైబర్ కూడా ఉంటుంది. దీని కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
గుమ్మడికాయ రసం తాగడం వల్ల కలిగే లాభాలు:
బరువు తగ్గడానికి..:
గుమ్మడికాయ రసంలో తక్కువ కేలరీలు, అధిక నీటి శాతం ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఆకలిని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
చర్మం ఆరోగ్యానికి మంచిది:
గుమ్మడికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా.. అందంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు అన్ని రకాల చర్మ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:
గుమ్మడికాయ రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని కారణంగా పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా మలబద్ధకం, పొట్ట నొప్పుల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
హృదయ ఆరోగ్యానికి మంచిది:
గుమ్మడికాయలో పొటాషియం అధికంగా లభిస్తుంది. కాబట్టి ఈ రసం తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా గుండె సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు గుండెలోని నరాలు కూడా బలహీనంగా తయారవుతాయి.
కంటి ఆరోగ్యం కోసం..:
గుమ్మడికాయలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మచ్చలు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.