Pulasa Fish Curry: తిన్న కొద్ది తినాలనిపించే పులస చేప కర్రీ.. సింపుల్‌గా రెడీ చేయండి!

Pulasa Fish Curry Recipe: చాలా మంది పులస చేపతో తయారు చేసిన పులుసు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మీరు కూడా ఈ కూరను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? తక్కువ పదార్థాలతో ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 15, 2024, 05:23 PM IST
Pulasa Fish Curry: తిన్న కొద్ది తినాలనిపించే పులస చేప కర్రీ.. సింపుల్‌గా రెడీ చేయండి!

Pulasa Fish Curry Recipe: అరుదుగా లభించే చేపల్లో పులస చేప ఒకటి. ఈ చేపతో తయారు చేసిన కర్రీని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది ఎక్కువగా గోదావరి పరిసర ప్రాంతాల్లో లభిస్తుంది. ఈ చేపలు చూడడానికి అన్ని చేపల కంటే విభిన్నంగా ఉంటాయి. పైనా తెలుపు రంగుతో చూడడానికి ఎంతో ఆకర్శనీయంగా ఉంటుంది. ఈ పులస చేపల్లో ఎముకలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఈ పులస చేపను ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధంగా వండుకుంటూ ఉంటారు. ఇందులో చాలా మంది చింత పులుసుకు పోసుకుని వండుకుంటే, మరికొంత మంది మామడి కాయతో ఈ కర్రీని తయారు చేసుకుంటారు. అయితే మీరు కూడా గోదారి స్టైల్‌ పులస చేప కర్రీని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి. 

కావలసిన పదార్థాలు:
పులస చేప - 500 గ్రాములు (ముక్కలుగా కోసినవి)
ఉల్లిపాయ - 1 (పెద్దది), తరిగినది
టమోటాలు - 2 (పెద్దవి), తరిగినవి
వెల్లుల్లి - 5 రెబ్బలు, తరిగినవి
అల్లం - 1 అంగుళం ముక్క, తరిగినది
ఆకు కరివేపాకు - 1 రెమ్మ
జీలకర్ర - 1 టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
మెంతులు - 1 టీస్పూన్
కారంపొడి - 1 టీస్పూన్
పసుపు - 1/2 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 3 టేబుల్ స్పూన్లు
నీరు - 2 కప్పులు
కొత్తిమీర - 1/2 కప్పు, తరిగినది

తయారీ విధానం:
ఒక గిన్నెలో పులస చేప ముక్కలను కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలిపి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి.
ఒక పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర, శనగపప్పు, మెంతులు వేసి వేయించాలి.
ఆ తర్వాత ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
ఆ తర్వాత ఇందులో టమోటాలు, కారంపొడి వేసి మెత్తబడేవరకు ఉడికించాలి.
ఇందులోనే నానబెట్టిన పులస చేప ముక్కలు ఉప్పు, నీరు వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత మూత పెట్టి 20 నుంచి 25 నిమిషాలు ఉడికించాలి.
ముక్కలు బాగా ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడిగా అన్నంతో వడ్డించాలి.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

చిట్కాలు:
మరింత రుచి కోసం ఈ కర్రీలో కొద్దిగా గరం మసాలా లేదా ఇంగువ కూడా వేసుకోవచ్చు.
మీకు ఇష్టమైతే ఈ కూరలో కొన్ని తరిగిన కరివేపాకు లేదా పచ్చిమిరపకాయలు, బెండకాయలు కూడా వేయవచ్చు.
ఈ కర్రీని అన్నం, రొట్టె లేదా ఇడ్లీతో వడ్డించుకుంటే రుచి బాగుంటుంది.
అలాగే ఈ చేప పులుసును వండిన మరసటి రోజు తింటే రుచి రెట్టింపు అవుతుంది. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News