Oats - Millets Idli: ఓట్స్, మిల్లెట్స్‌ ఇడ్లీలను ఉదయం టిఫిన్‌గా కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకోండి ఇలా!

Oats - Millets Idli: ఓట్స్, మిల్లెట్స్‌తో తయారుచేసిన ఇడ్లీలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి ముఖ్యంగా వీటిని పిల్లలకు లంచ్ బాక్స్‌లో ఇవ్వడం వల్ల వారు ఎంతో యాక్టివ్ గా ఉంటారు.  వీటిని తయారు చేసుకోవడం చాలా కష్టమని అనుకుంటారు.. కానీ చాలా సులభం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2024, 11:00 PM IST
Oats - Millets Idli: ఓట్స్, మిల్లెట్స్‌ ఇడ్లీలను ఉదయం టిఫిన్‌గా కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకోండి ఇలా!

Oats - Millets Idli: ఓట్స్ మన శరీరానికి శక్తి శక్తిని అందించడమే కాకుండా ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి వీటిని రోజు ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి రోజు అనేక రకాల లాభాలు కలుగుతాయి. అయితే చాలామంది తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా ఓట్స్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. వీటితో తయారుచేసిన ఆహారాలు నోటికి రుచిని అందించడమే జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. దీంతో పాటు మిల్లెట్స్‌ కూడా ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. అయితే వీటితో తయారు చేసిన ఆహారాలు కొంతమంది పిల్లలు తినేందుకు ఇష్టపడరు. వీరి కోసం ప్రత్యేకమైన ఓట్స్, మిల్లెట్స్‌ ఇడ్లీ రెసిపీని పరిచయం చేయబోతున్నాం.. ఈ ఓట్స్ ఇడ్లీ రోజంతా పిల్లల శరీరాన్ని యాక్టివ్గా ఉంచేందుకు సహాయపడతాయి. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలి. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
ఒకటిన్నర కప్పు ఓట్స్
కప్పు మిల్లెట్స్‌
సగం కప్పు ఉప్మా రవ్వ
ఒక కప్పు పెరుగు
తగినంత వంట సోడా
ఇడ్లీలకు సరిపడా ఉప్పు
అర టీ స్పూన్ అల్లం పేస్ట్
చిన్నవిగా తరిమిన పచ్చిమిర్చి రెండు
తరిగిన కొత్తిమీర ఆకు
చిన్నవిగా ముక్కలు ముక్కలుగా తరుముకున్న క్యారెట్

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
తయారీ విధానం:
ముందుగా ప్రీమియం క్వాలిటీ కలిగిన ఓట్స్‌, మిల్లెట్స్‌ తీసుకొని స్టవ్ పై కళాయి పెట్టి అందులో క్రిస్పీ అయ్యేదాకా వేయించాల్సి ఉంటుంది ఆ తర్వాత అందులోనే బొంబాయి రవ్వను వేసుకొని మరికొద్ది సేపు వేయించుకోవాలి. ఇలా రెండిటిని మిక్సీ జార్ లో వేసుకుని ఇడ్లీ రవ్వలా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పట్టుకున్నా రవ్వను ఒక బౌల్ లోకి తీసుకొని అందులో నీళ్లను వేసుకొని పక్కన పెట్టుకున్న పెరుగును కూడా పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని 20 నుంచి 25 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని నానబెట్టాల్సి ఉంటుంది.

ఇలా పక్కన పెట్టుకున్న ఇడ్లీ పిండిలో ఉప్పు, ఆ తర్వాత మీరు పక్కన పెట్టుకున్న పదార్థాలు అన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందులోనే తగినంత వంట సోడా వేసుకొని మరో నిమిషం పాటు బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో తగినన్ని నీటిని నింపుకొని ఇడ్లీ పాత్రలో ఈ ఓట్స్, మిల్లెన్స్‌ మిశ్రమాన్ని ఇడ్లీల్లా నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇడ్లీలను బాగా ఉడికించుకొని సర్వ్ చేసుకుని పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ తో తీసుకుంటే నోటికి ఎంతో రుచిని కలిగి ఉంటాయి.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News