LIC Policy Revival: పాలసీదారుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ అవకాశం కల్పించింది. గతంలో ఎల్ఐసీ పాలసీ తీసుకుని వదిలేసుంటే..తిరిగి బతికించుకోవచ్చు. అవును..నిజమే ఎల్ఐసీ కొత్తగా ఈ సౌలభ్యాన్ని అందించింది.
ఎల్ఐసీ భీమా పాలసీలు చాలావరకూ అర్ధంతరంగా నిలిచిపోయుంటాయి. కట్టలేక కావచ్చు..మరో ఇతర కారణం కావచ్చు కొంతకాలం కట్టిన తరవాత ఆపేస్తుంటాము. ఇలాంటి పాలసీలు రద్దయిపోతుంటాయి. ఎల్ఐసీ ఇప్పుడు అటువంటి పాలసీల విషయంలో ఎల్ఐసీ కొత్త వెసులుబాటు కల్పించింది. మధ్యలో వదిలేసిన పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం కల్పిస్తోంది. దీనికోసం ఎల్ఐసీ (LIC)స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. చెల్లించాల్సిన ఫైన్‌పై డిస్కౌంట్ కూడా ప్రకటించింది. గత ఏడాది ఆగస్టు 23వ తేదీన ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ ద్వారా చాలామంది లబ్ది పొందారు. భారీగా పాలసీదారులు తమ తమ పాలసీలను రెన్యువల్ చేయించుకున్నారు. ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిలో ఉన్న పాలసీలు, పాలసీ వ్యవధిని పూర్తి చేయని పాలసీలను ఇందులో పునరుద్ధరించుకోవచ్చని ఎల్ఐసీ వెల్లడించింది.
పునరుద్ధరణ ప్రీమియం మొత్తంపై ఎల్ఐసీ (LIC Policy Revival) రాయితీ ప్రకటించింది. ఐదేళ్లుగా ఓ పాలసీను మూసివేస్తే..తిరిగి ఈ క్యాంపెయిన్ ద్వారా పునరుద్ధరించవచ్చు. దీనికి సంబంధించిన షరతులు, నిబంధనలు కూడా జారీ అయ్యాయి. మొత్తం పునరుద్ధరణ ప్రీమియం లక్ష రూపాయల వరకూ ఉంటే రాయితీ 20 శాతం ఉంటుంది.1-3 లక్షల వరకూ ప్రీమియం మొత్తానికి రాయితీ 25 శాతం అంటే గరిష్టంగా 2 వేల 5 వందల రూపాయలవరకూ ఉంటుంది. ప్రీమియం మొత్తం 3 లక్షల కంటే ఎక్కువుంటే 30 శాతం రాయితీ లభించనుంది. ఇది కాకుండా ఎల్ఐసీ జీవిత భీమా ఆరోగ్య రక్షక్ పాలసీని ప్రారంభించింది. ఇది పూర్తిగా ఆరోగ్య భీమా పథకం. ఇది రెగ్యులర్ ప్రీమియం నాన్ లింక్డ్ పాలసీ. ఈ పాలసీ కింద స్థిరమైన ప్రయోజనం లభిస్తుంది.
Also read: Mahesh Babu Emotional: ఎప్పటికీ నా అన్నయ్యవే.. రమేష్ బాబు మరణంపై మహేష్ బాబు ఎమోషనల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook