Infertility Problem: శరీరంలో సగం అనారోగ్య సమస్యలకు కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలి. బిజీ లైఫ్ కారణంగా ఇటీవల ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలు పెరిగిపోతున్నాయి. మహిళల్లో అయితే అండాలు నాణ్యత లేకపోవడం, పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ సరిగ్గా లేకపోవడం ఇలా వివిధ రకాలైన అంశాలు కారణమౌతున్నాయి.
ఆధునిక జీవన విధానంలో పెరుగుతున్న ప్రధాన సమస్య ఇన్‌ఫెర్టిలిటీ. మహిళలు, పురుషులు ఇరువురిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాలతో శారీరక శ్రమ లోపించడం వల్ల శరీరంలో హార్మోన్ బ్యాలెన్స్ తప్పుతోంది. దీనికితోడు ఒత్తిడి, ఆందోళన వంటివి ఇన్‌ఫెర్టిలిటీకు కారణమౌతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లే కాబట్టి, హెల్తీ ఫుడ్ ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
దేశంలో ఇన్‌ఫెర్టిలిటీ సమస్య ఎక్కువగా ఉన్నందువల్లే ఆ సమస్యకు సంబంధించిన ఆసుపత్రుల సంఖ్య పెరిగిపోతోంది. ఐవీఎఫ్ వంటి చికిత్సా విధానాలతో సంతాన సాఫల్యత పొందుతున్నారు. అయితే ఇందులో సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఖర్చు ఎక్కువ. ఎంతవరకూ ఈ చికిత్సా విధానం మంచి ఫలితాలనిస్తుందో తెలియదు. ఇన్‌ఫెర్టిలిటీకు రెండు ప్రధాన కారణాలుంటాయి. మహిళల్లో అయితే అండం నాణ్యత లేకపోవడం. పురుషుల్లో అయితే స్పెర్మ్ కౌంట్ తక్కువ లేదా నాణ్యత లేకపోవడం. ఈ సమస్యలకు కొన్నిరకాల ఆహార పదార్ధాల ద్వారా పరిష్కారం లభిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ప్రకృతిలో విరివిగా లభించే వివిధ రకాల తృణ ధాన్యాల్లో ఒకటైన క్వినోవా మంచి పరిష్కారం. ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మహిళల్లో గర్భధారణకు తోడ్పడే ప్రక్రియల్ని వేగవంతం చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుంది. ముఖ్యంగా నెలసరిని నియంత్రించగలుగుతుంది. ఫైబర్ పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది.
ఇక మరో ఆహారం గుమ్మడి కాయ గింజలు. వీటిని క్రమం తప్పకుండా తింటే శరీరంలో పరిపక్వ కణాలు అభివృద్ధి చెంది ఇన్‌ఫెర్టిలిటీ తగ్గుతుంది. సంతానోత్పత్తి సామర్ధ్యం పెరుగుతుంది. ఇందులో ఉంటే జింక్ కారణంగా పురుషుల్లో టెస్టోస్టెరోన్, స్పెర్మ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇక మరో అద్భుతమైన ఆహారం ఆకు కూరలు. పాలకూర, మెంతికూర, బ్రోకోలి వంటి ఆకుకూరల్ని తరచూ డైట్‌లో చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి వంటి మూలకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఫలితంగా ఓవులేషన్ ప్రక్రియ మెరుగుపడుతుంది. గర్భధారణ సమయంలో గర్భస్రావం కాకుండా చేస్తుంది.
ఇక అన్నింటికంటే బెస్ట్ డ్రై ఫ్రూట్స్ వినియోగం. ఇందులో సంతానోత్సత్తి సామర్ధ్యాన్ని పెంచే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ చాలా ఎక్కువ. వాల్‌నట్స్‌లో ఉండే సెలీనియం కారణంగా అండాల్లో ఏర్పడే క్రోమోజోమ్ నష్టం తగ్గుతుంది. అదే సమయంలో ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు..ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తాయి.
Also read: Liver Diseases: లివర్ వ్యాధులు మహిళల్లో ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి, నివారణ మార్గాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook