Independence Day Speech 2024: భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15వ తేదీన 1947 లో వచ్చింది. ఈ సంవత్సరం మనమంతా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎందరో త్యాగాల ఫలితంగా ఆంగ్లేయులను నుంచి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. స్వాతంత్రం కోసం పోరాడిన వారి త్యాగాలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈరోజు పల్లె పల్లెనా వాడవాడనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ముఖ్యంగా పాఠశాలల్లోనైతే ఈ దినోత్సవం ఒక పండగ లాగా జరుగుతుంది. ఈరోజు స్కూల్స్ లోని పిల్లలు స్వాతంత్రం గురించి వివిధ రకాలైన స్పీచ్ లు కూడా ఇస్తారు. దీని గాను వారికి ఉపాధ్యాయులు బహుమతులు కూడా ఇస్తారు. ఈ సంవత్సరం మీ పిల్లలు కూడా పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాస పోటీల్లో పాల్గొంటున్నారా? అయితే ఈ ఉత్తమమైన స్పీచ్ ని వారికి తెలపండి.
ఉపన్యాసం..
మన భారతదేశం తన స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఘనంగా జరుపుకుంటుంది. ఈ రోజు మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. బ్రిటిష్ వలసపాలకుల నుంచి విముక్తి పొంది, స్వయం ప్రతిపత్తిని సాధించిన రోజు. ఈ రోజు మన దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ.. అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.
స్వాతంత్ర వీరుల త్యాగాలు:
మన స్వాతంత్ర వీరుల త్యాగాలకు, బలిదానాలకు ఈ రోజు నివాళి అర్పించే రోజు. గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయులు మనకు స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను అర్పించారు. వారి స్ఫూర్తితో మనం మన దేశాన్ని అభివృద్ధి చేయాలి. భగత్ సింగ్, రాణి లక్ష్మీబాయి, సుఖ్‌దేవ్, రాజగురు వంటి వీరులు కూడా మన స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు.
దేశాభివృద్ధి:
మన దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. అవి: నిరుద్యోగం, పేదరికం, అవినీతి, అసమానతలు. ఈ సమస్యలను తొలగించడానికి మనందరం కలిసి కట్టుగా ఉండాలి. మన దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలు వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. స్టార్టప్‌లు, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా మన దేశం ఆర్థికంగా బలోపేతమవుతోంది. వీటన్నిటికీ ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కొత్త కార్యక్రమాలను చేపట్టాలి.
భవిష్యత్తు:
మన దేశం అనేక సంస్కృతులు, భాషలు కలిగిన దేశం. మనందరం కలిసి సమాజాన్ని అభివృద్ధి చేయాలి. మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలి. ఈ స్వాతంత్ర దినోత్సవం మనకు మరోసారి మన దేశం పట్ల కట్టుబడి ఉండాలని స్ఫూర్తినిస్తుంది. అందుకే కుల మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరు మన దేశ అభివృద్ధిలో భాగంగా కష్టపడి పని చేస్తూ ముందుకు సాగాలి.
యువత పాత్ర:
ఆధునిక భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక రంగంలో మన యువత అద్భుతమైన విజయాలు సాధిస్తోంది. వారు మన దేశానికి భవిష్యత్తు.. కాబట్టి వారికి అద్భుతమైన విద్యా అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా సహకరించాలి. అంతేకాకుండా కొత్త టెక్నాలజీకి తగ్గట్లుగా కొత్త కొత్త కళాశాలలను నిర్మించాలి. అలాగే వారిలో నైపుణ్యాలను పెంపొందించి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
సవాళ్లు:
మన దేశం ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన అంశాలు: జనాభా పెరుగుదల, వాతావరణ మార్పులు, సహజ వైపరీత్యాలు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి మనం సామూహికంగా కృషి చేయాలి. అంతేకాకుండా దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు దేశభక్తి మార్గంలో నడిస్తే అన్ని సవాళ్ల నుంచి విముక్తి కలుగుతుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.