Home Remedies For Wrinkles: ప్రస్తుతం చిన్న వయసుల్లోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. ఇవి వృద్ధాప్యనికి సంకేతాలుగా మారుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాల్లో పోషకాలు అధికంగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే చర్మం యవ్వనంగా కనిపించేందుకు పుల రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పలు రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అయితే ముడుతలను తొలగించడానికి (Wrinkles Home Remedies) ఎలాంటి హోమ్ రెమెడీస్‌ను వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ముడతలకు హోం రెమెడీస్:
అరటిపండు:
అరటిపండును పేస్ట్‌లా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. వేళ్ల సహాయంతో ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇలా అప్లై చేసిన మిశ్రమాన్ని సుమారు 15 నుంచి 20 నిమిషాలు పాటు ఉంచాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చర్మానికి విటమిన్ ఎ, బి6, సి పుష్కలంగా అంది చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తుంది.
పెరుగు:
పెరుగును చర్మంని అప్లై చేయడం వల్ల కూడా చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని చర్మ వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కోసం.. ఒక గిన్నెలో రెండు చెంచాల పెరుగు, ఒక చెంచా తేనె, ఒక విటమిన్ ఇ క్యాప్సూల్స్, చుక్కల నిమ్మరసం వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చాలా రకాల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను ముఖానికి రాసుకుంటే చర్మం పొడిబారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా జిడ్డు చర్మం నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Sunny Leone: సన్నీ లియోన్ పెదవికి గాయం!.. కావడానికి ఇదే కారణమా..?
Also Read: Sunny Leone: సన్నీ లియోన్ పెదవికి గాయం!.. కావడానికి ఇదే కారణమా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook