Periods Missing Reasons: మహిళలు పీరియడ్స్ తప్పడానికి కారణాలేంటి, ఏం చేయాలి

Periods Missing Reasons: పురుషులతో పోలిస్తే మహిళలకు ఆరోగ్యపరమైన సమస్యలు అధికమనే చెప్పాలి. మహిళలకు నిర్ణీత వయస్సు వచ్చినప్పటి నుంచి నెలసరి అనేది సహజసిద్ధంగా తలెత్తే ప్రక్రియ.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 16, 2023, 11:30 PM IST
Periods Missing Reasons: మహిళలు పీరియడ్స్ తప్పడానికి కారణాలేంటి, ఏం చేయాలి

Periods Missing Reasons: మహిళలకు నిర్ణీత వయస్సు అంటే మెచ్యూరిటీ పొందినప్పట్నించి తిరిగి 45-50 ఏళ్ల ప్రాయంలో మెనోపాజ్ వరకూ తలెత్తే ఓ ప్రక్రియ నెలసరి. ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే పీరియడ్స్ తప్పుతుంటాయి. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటనేది తెలుసుకుందాం..

సాధారణంగా మహిళలకు మెచ్యూరిటీ మొదలైనప్పట్నించి మెనోపాజ్ వయస్సు వచ్చేవరకూ క్రమం తప్పకుండా రుతుస్రావం అనేది సహజంగా జరిగే ప్రక్రియ.పీరియడ్స్ ఆకస్మాత్తుగా ఆగితే సహజంగా ప్రెగ్నెన్సీ లక్షణంగా భావిస్తారు. కానీ చాలా సందర్బాల్లో పీరియడ్స్ రాకపోవడానికి కారణం ఇంకా చాలా ఉన్నాయి. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఇటీవల చిన్న వయస్సు నుంచే పీరియడ్స్ ప్రారంభమౌతున్నాయి. ఎప్పుడైనా సమస్య ఏర్పడితే ఆందోళన ప్రారంభమౌతుంది. 

సాదారణంగా హార్మోన్లలో సమస్య ఉన్నా...హార్మోన్ల ఉత్పత్తిలో అసమతుల్యత ఏర్పడినా పీరియడ్స్ తప్పుతుంటాయి. బరువు ఆకస్మికంగా పెరగడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అంతేకాదు..ఇటీవలి కాలంలో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న ఒత్తిడి వల్ల కూడా పీరియడ్స్ మిస్ అవుతుంటాయి. ఒత్తిడి అనేది హార్మోన్లపై ప్రభావం చూపిస్తుంటుంది. జిమ్‌కు ఎక్కువగా వెళ్లేవారిలో కూడా ఈ సమస్య తరచూ కన్పిస్తుంది. 

కొంతమందిలో అండాశయం ఫలవంతంగా ఉన్నా సరే..పీరియడ్స్ మిస్ అవుతుంటాయి. ఈ పరిస్థితి ఉన్నప్పుడు తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. లైఫ్‌స్టైల్ వ్యాధుల్లో ఒకటైన థైరాయిడ్ వల్ల మహిళల్లో పీరియడ్స్ సమస్య ఉత్పన్నం కావచ్చు.

ఇటీవలి కాలంలో టీనేజ్ యువత ఎక్కువగా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ తింటోంది. ఇలాంటి ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో మెటబోలిజంలో సమస్య ఏర్పడుతుంది. ఇది కాస్తా హార్మోన్ సమస్యకు దారితీయడం వల్ల పీరియడ్స్ మిస్ అవుతుంటాయి.

Also read: Health Tips: రోజూ ఈ నీళ్లు తాగితే కేవలం 5 వారాల్లో 5 కిలోల బరువు తగ్గడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News