Hair Care Tips: హెయిర్ స్ట్రైటనింగ్ తరువాత ఆ సమస్యలు ఎదురౌతున్నాయా...ఇలా చేయండి చాలు

Hair Care Tips: మృదువైన, అందమైన జుట్టు ఉండాలని అందరికీ ఉంటుంది. జుట్టు సంరక్షణకు అమ్మాయిలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డ్రై హెయిర్, హెయిర్ డ్యామేజ్ నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని అద్భుతమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 18, 2022, 06:12 PM IST
Hair Care Tips: హెయిర్ స్ట్రైటనింగ్ తరువాత ఆ సమస్యలు ఎదురౌతున్నాయా...ఇలా చేయండి చాలు

Hair Care Tips: మృదువైన, అందమైన జుట్టు ఉండాలని అందరికీ ఉంటుంది. జుట్టు సంరక్షణకు అమ్మాయిలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డ్రై హెయిర్, హెయిర్ డ్యామేజ్ నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని అద్భుతమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..

జుట్టు సంరక్షణలో భాగంగా అమ్మాయిలు ఎక్కువగా హెయిర్ స్ట్రైటనింగ్ చేస్తుంటారు. కానీ హెయిర్ స్ట్రైటనింగ్ తరువాత చాలామంది జుట్టు డ్రై అవడం లేదా దెబ్బతినడం జరుగుతుంటుంది. ఒకసారి మోల్డ్ అయిన తరువాత అదే స్థానంలో రాలిపోతుంటుంది. ఫలితంగా జుట్టు దెబ్బతింటుంది. ఈ పరిస్థితుల్లో మీ జుట్టుకు హైడ్రెషన్ అవసరమౌతుంది. హెయిల్ ఫాల్ లేదా డ్రై హెయిర్ నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు చూద్దాం..

డ్యామేజ్ వెంట్రుకల్ని సరిచేసేందుకు ట్రిమ్ చేయాలి. ఫలితంగా వేగంగా జుట్టు పెరుగుతుంది. స్ట్రైటనింగ్ తరువాత డ్రై అయిన, మోల్డ్ అయిన జుట్టును సరిచేసందుకు దోహదపడుతుంది. దీనివల్ల మీ జుట్టు చిక్కు పడదు. అందుకే హెయిర్ ట్రిమ్ చాలా మంచిది. తరచూ తలస్నానం చేయడం వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువసార్లు తలస్నానం చేయడం వల్ల జుట్టులో ఉండే మాయిశ్చరైజర్ పోతుంది. ఫలితంగా నిర్జీవంగా కన్పిస్తాయి. అందుకే తలస్నానమనేది వారానికి రెండుసార్లు మాత్రమే చేయాలి. 

హెయిర్ స్ట్రైటనింగ్ తరువాత మీ జుట్టు చాలా సున్నితంగా మారిపోతుంది. అందుకే ఎక్కువ కేర్ అవసరమౌతుంది. ఈ పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు ఎండకు ఎక్స్‌పోజ్ కాకుండా కప్పుకోవాలి. స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా జుట్టు వదులుగా ఉండకూడదు. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ నీళ్లలో ఉండే క్లోరిన్ జుట్టును డ్యామేజ్ చేస్తుంది. ఫలితంగా హెయిర్ ఫాల్ సమస్య వస్తుంది.  ఇక జుట్టును హైడ్రేట్ చేసేందుకు డీప్ కండీషనింగ్ ట్రీట్‌మెంట్ చేయించుకోవాలి. ఇది హెయిర్ కేర్‌లో భాగం. మంచి బ్రాండెడ్ హెయిర్ స్పా వాడితే జుట్టుకు మృదుత్వం అందుతుంది.

Also read: Homemade Face Wash: చర్మంపై ఏ సమస్యలైనా సరే 2 రోజుల్లో మాయం..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News