Tips To Avoid Air Pollution: కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేసి చూడండి!

How to Reduce Air Pollution and Breath Clean Air | వాయు కాలుష్యం మనిషి ఆరోగ్యానికే కాదు భూమికి కూడా హానికలిగిస్తోంది. కాలుష్యం వల్ల ఉష్ణోగ్రతలు పెరడగంతో పాటు ఎన్నోరకాల వ్యాధులు కూడా వస్తాయి. 

Last Updated : Nov 9, 2020, 02:08 PM IST
    1. వాయు కాలుష్యం మనిషి ఆరోగ్యానికే కాదు భూమికి కూడా హానికలిగిస్తోంది.
    2. కాలుష్యం వల్ల ఉష్ణోగ్రతలు పెరడగంతో పాటు ఎన్నోరకాల వ్యాధులు కూడా వస్తాయి.
    3. మీథేన్, కార్బన్ డయాక్సైడ్, పాలేన్ వంటి కాలుష్య కారకాల వల్ల గాలి నాణ్యత తగ్గుతంది.
    4. వాహనాల, ఫ్యాక్టరీలు ఇతర కారకాల నుంచి నుంచి వెలువడే పొగ వల్ల వాయు కాలుష్యం కలుగుతుంది.
Tips To Avoid Air Pollution: కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేసి చూడండి!

Air Pollution Prevention Tips | వాయు కాలుష్యం మనిషి ఆరోగ్యానికే కాదు భూమికి కూడా హానికలిగిస్తోంది. కాలుష్యం ( Pollution ) వల్ల ఉష్ణోగ్రతలు పెరడగంతో పాటు ఎన్నోరకాల వ్యాధులు కూడా వస్తాయి. మీథేన్, కార్బన్ డయాక్సైడ్, పాలేన్ వంటి కాలుష్య కారకాల వల్ల గాలి నాణ్యత తగ్గుతంది. వాహనాల, ఫ్యాక్టరీలు ఇతర కారకాల నుంచి నుంచి వెలువడే పొగ  వల్ల వాయు కాలుష్యం ( Air Pollution ) కలుగుతుంది.

Also Read : Tips To Buy Gold: ఈ దీపావళికి బంగారం కొంటున్నారా?  అయితే ఈ టిప్స్ మీకోసమే!

వాయు కాలుష్యం మనుషులను చంపేంత ప్రమాదకరమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) నిర్వహించిన ఒక సర్వేలో 2016లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4.2 మిలియన్ల ( 42 లక్షలు)  అకాల మరణాలు జరిగాయట. బయట ఉండే వాయు కాలుష్య వల్లే ఇంత ప్రమాదం అని మనలో చాలా మంది అనుకుంటారు. కానీ ఇండోర్ పోల్యూషన్ అంటే మనం నివసించే పరిసరాల్లో ఉండే పొల్యూషన్ వల్ల కూడా ఆరోగ్యం ( Health ) చెడిపోతుంది.

Also Read | Firecrackers in Diwali: టపాసులపై బ్యాన్ విధించిన 6 రాష్ట్రాలు. లిస్ట్ చెక్ చేయండి

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 300 కోట్ల మంది బొగ్గు, కిరోసిన్, జీవవ్యర్ధాలు, కట్టెలతో వంట చేస్తారు. భారత దేశంలో పైన వివరించిన సాధనాలు వాడి వంట చేసేవారి సంఖ్య సుమారు 65.53 శాతంగా ఉంది

పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న చిన్న గ్రామాల వరకు కాలుష్యం వల్ల ఎంతోమంది అనారోగ్యానికి గురవుతున్నారు.
ఇలాంటి కాలుష్య భూతం నుంచి తప్పించుకోవాలి అంటే ఈ చిట్కాలు పాటించండి

వెదర్ రిపోర్ట్
ఇంటి నుంచి బయటికి వచ్చే ముందు వెదర్ రిపోర్ట్ (Weather Report) అంటే వాతావరణ నివేదిక తప్పకుండా చదవండి. దాన్ని బట్టి తగిన ఏర్పాట్లతో బయటికి రండి.

Also Read | 10 Lakh Dollar: దుబాయి లాటరీలో భారత సంతతి వ్యక్తికి కాసుల పంట

జాగ్రత్త
కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఆరుబయట తిరగడం, వర్కవుట్లు చేయడం, జాగింగ్ (Jogging), వాకింగ్ చేయకూడదు.

మరో దారి...
కొన్ని ఏరియాల్లో నిత్యం ట్రాఫిక్ ఉంటుంది. అలాంటి ప్రాంతాలగుండా వెళ్లకుండా మరోదారి ఎంచుకోండి. ఒకవేళ వెళ్లినా ఎక్కువసేపు అక్కడ ఉండకండి.

వీటిని మానేయండి
వాతావరణానికి హాని కలిగించే ఇంధన సాధనాలు అంటే ఎనర్జీ సోర్సెన్ ను వాడటం తగ్గించండి. దీని వవల్ల గ్రైన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ (Greenhouse Gas Emissions )  జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం.

Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే

ప్రయాణం ఇలా
వీలైతే నడిచి వెళ్లండి, లేదంటే సైకిల్ వాడండీ, లేదా పబ్లిక్ ట్రాన్స్ ఫోర్టు, కార్పూలింగ్ ( Carpooling ) వ్యవస్థలను వాడి మనవైపు నుంచి కాలుష్యం కలగకుండా చూసుకోవచ్చు.

కాల్చకండి
చెత్తను, లేదా కర్రలను కాల్చకండి. వాటి నుంచి విడుదలయ్యే పొగ వల్ల కాలుష్యం కలిగి ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

కాలుష్యం లేని గాలి పీల్చడానికి హాయిగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వాతావరణానికి కూడా చాలా మంచిది. మన చిన్న చిన్న అలవాట్ల వల్ల ఎంతో కొంత మార్పు వస్తుంది అంటే అది చాలు కదా మనకు. హాయిగా ఊపిరి తీసుకుందాం.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News