Delhi Air Pollution: ప్రాణాంతకమైన కాలుష్యంతో నరకయాతన అనుభవిస్తున్న ఢిల్లీ ప్రజలకు కాస్త ఊరట లభించింది. వరుణుడు కరుణించడంతో కాలుష్యం కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Air Pollution Updates: దేశ రాజధాని ఢిల్లీపై వరుణుడు కరుణచూపించాడు. తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వర్షం కురవడంతో ప్రజలకు ఊరట లభించింది. గురువారం రాత్రి, నేడు తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలలో కాలుష్యం కూడా ఒకటి. ముఖ్యంగా వాహనాలు, పరిశ్రమల నుండి వెలువడే వాటి కారణంగా వాయు కాలుష్యం రెట్టింపు అవుతుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించటానికి హాంగ్ కాంగ్ లో కాలుష్యాన్ని కనిపెట్టే సెన్సార్ లను తీసుకొచ్చారు.
Sperm Count: ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు చెందిన వేలాది మంది పురుషులు శుక్రకణాల లోపంతో బాధపడుతున్నారని చైనాలో జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
Delhi Air pollution: దిల్లీ ప్రభుత్వం తిరిగి స్కూళ్లు తెరవడంపై ఇవాళ సుప్రీంకోర్టు కన్నెర్ర జేసింది. ఈ నేపథ్యంలో.. పాఠశాలలను శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీ ఊపిరి పీల్చుకోలేకపోతోంది. వాయు కాలుష్యం రోజురోజుకూ దిగజారిపోతూ నగర ప్రజలకు శ్వాస అందని పరిస్థితి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాలుష్యం కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రజల పరిస్థితి అతలాకుతలమవుతోంది. ఆకాశం పూర్తిగా పొగమంచు కప్పబడి ఉన్నందువలన ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) కొన్ని చర్యలు తీసుకున్నారు.
Delhi Pollution: ఢిల్లీలో మళ్లీ కాలుష్యం పెరిగింది. దీనితో గురువారం గాలి నాణ్యత కనిష్ఠ స్థాయికి తగ్గింది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశమున్నట్లు గాలి నాణ్యత పరిశోధన విభాగం వెల్లడించింది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి తీవ్రరూపం దాలుస్తుండటంతో.. దీపావళి పర్వదినాన (deepavali 2020) టపాసులు కాల్చడంపై ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ (Telangana) లో కూడా దీపావళి టపాసులను (Firecrackers Ban) ఖచ్చితంగా నిషేధించాలని హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రతీ ఏడాది దీపావళి (deepavali 2020) పర్వదినం కోసం భారతీయులంతా ముందుస్తుగానే సిద్ధం అవుతుంటారు. అయితే కరోనా (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతుండటంతో.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మరింత దిగజారుతాయని గమనించి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే టపాసులు కాల్చడంపై నిషేధం (Diwali Firecrackers ban) విధిస్తూ చర్యలు తీసుకున్నాయి.
How to Reduce Air Pollution and Breath Clean Air | వాయు కాలుష్యం మనిషి ఆరోగ్యానికే కాదు భూమికి కూడా హానికలిగిస్తోంది. కాలుష్యం వల్ల ఉష్ణోగ్రతలు పెరడగంతో పాటు ఎన్నోరకాల వ్యాధులు కూడా వస్తాయి.
మీరు గమనించారో లేదో కానీ ఈ మధ్య పార్లమెంట్ సభ్యుడు శశీ థరూర్ ( Shashi Tharoor ), బాలీవుడ్ నటి యామీ గౌతమ్ మెడలో ఒక పరికరం కనిపిస్తోంది. ఇది స్మార్ట్ ఫోన్ లేదా ఇంకేదో బ్లూటూత్ డివైజ్ అనుకోవచ్చు.. నిజానికి అది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్. వాయు కాలుష్యం నుంచి, గాలిలో ఉన్న వైరస్ నుంచి అది కాపాడుతుందట.
పెను ప్రమాదకరంగా మారిన కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో అన్ని ప్రాథమిక పాఠశాలల్ని బుధవారం మూసివేస్తున్నట్లు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా ప్రకటించారు. అవసరాన్ని బట్టి తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటామని ఆయన ప్రకటించారు. పాఠశాలల్లో ఉదయంపూట నిర్వహించే ప్రేయర్ సహా, ఆటలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించరాదని పాఠశాల యాజమాన్యాలను ఆయన ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు అందే వరకు కొద్దిరోజులు ఇలానే కొనసాగించాలని చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. నగరంలో 'హెల్త్ ఎమర్జెన్సీ' ప్రకటించారు. పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్లకూడదని వైద్యులు సూచించారు. అంతేకాక ఈ నెలలో జరగనున్న 'హాఫ్ మారథాన్' ను నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కోరింది. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) పెరిగిపోయిందని, అందుకే నవంబర్19న నిర్వహించ తలపెట్టిన పరుగును రద్దు చేయాలని కోరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.