AC Users Advise: వేసవి కాలం కావడంతో ప్రజలు ఏసీల వినియోగం పెంచారు. తీవ్ర ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఏసీ అతి తక్కువ డిగ్రీలు ఉంచి ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే ఏసీల అధిక వినియోగం వలన విద్యుత్ బిల్లు భారీగా వస్తోంది. దీనికితోడు అధిక ఏసీ వినియోగంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. అలాంటి ఇబ్బందులు పడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఏసీని వినియోగిస్తూనే తక్కువ బిల్లు పొందడంతోపాటు సురక్షితంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఈ సందర్భంగా ఏసీ వినియోగంపై ఇంధన మంత్రిత్వ శాఖ కూడా కొన్ని సలహాలు చేసింది.
Also Read: Iqoo Z9X 5G: మొదటి సేల్‌లో Iqoo Z9X మొబైల్‌పై భారీ తగ్గింపు.. ధర చూస్తే కొనడం ఖాయం!
ఏసీని ఎప్పుడూ 26 డిగ్రీలు ఉంచాలి. అంతకంటే ఎక్కువ కూడా ఉంచుకోవచ్చు. కానీ తగ్గించవద్దు. వేడి విషయంలో వినియోగదారులు సీలింగ్ ఫ్యాన్ ఉపయోగించవచ్చు. ఏసీ వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అప్రమత్తత, జాగ్రత్తగా లేకపోతే అనారోగ్యానికి కూడా గురవచ్చని హెచ్చరించారు. ఉష్ణోగ్రత (టెంపరేచర్) అధికంగా తగ్గించి ఏసీని వినియోగిస్తుంటే విద్యుత్ బిల్లు పెరిగిపోతుంది. దీంతోపాటు అనేక వ్యాధుల బారినపడుతారని అని చెప్పారు.
Also Read: Google Pay Close: అలర్ట్.. గూగుల్ పే సేవలు బంద్.. ఎందుకో తెలుసా?
ఇలా ప్రభుత్వ అధికారి చెప్పడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. మానవుడి శరీరం 22 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. అంతకు తగ్గినా.. పెరిగినా ఇబ్బంది పడుతుంది. మన బాడీ టెంపరేచర్ తట్టుకునే దానికన్నా ఏసీ టెంపరేచర్ తక్కువగా ఉంటే వ్యాధులు వస్తాయి. 26 డిగ్రీల కంటే ఎక్కువ ఏసీ ఉష్ణోగ్రత ఉంచితే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇలా చేయడం వలన రాత్రివేళ 5 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. ఏసీ ఉష్ణోగ్రతను 26 డిగ్రీల వద్ద ఉంచి చల్లదనంతోపాటు విద్యుత్ ఆదా.. ఆరోగ్యాన్ని పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter