High Blood Pressure: వర్షాకాలంలో రక్తపోటు మరింతగా పెరగనుందా..యోగాతో చెక్

High Blood Pressure: ఆధునిక పోటీ ప్రపంచంలో అధికశాతం ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నవాళ్లే.  వర్షాకాలం వచ్చిందంటే ఆ సమస్య మరింతగా పెరగవచ్చు. మెరుగైన ఫలితాల కోసం ఏం చేయాలో ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 13, 2022, 05:08 PM IST
High Blood Pressure: వర్షాకాలంలో రక్తపోటు మరింతగా పెరగనుందా..యోగాతో చెక్

High Blood Pressure: ఆధునిక పోటీ ప్రపంచంలో అధికశాతం ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నవాళ్లే.  వర్షాకాలం వచ్చిందంటే ఆ సమస్య మరింతగా పెరగవచ్చు. మెరుగైన ఫలితాల కోసం ఏం చేయాలో ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.

అధిక రక్తపోటు ప్రస్తుత రోజుల్లో సాధారణమైపోయింది. వర్షాకాలంలో ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. నిర్ణీత పద్ధతిలో అంటే క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి ఆహారం, సరైన నిద్ర చాలా అవసరం. యోగా ద్వారా ఒత్తిడిని నియంత్రించవచ్చంటున్నారు. ఇవన్నీ అధిక రక్తపోటు నియంత్రణలో కీలకంగా పనిచేస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా 26 శాతం మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అధిక రక్తపోటు అనేది జీవనశైలికి ఇబ్బందిగా మారడమే కాకుండా..ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ పరిస్థితుల్లో వర్షాకాలంలో రక్తపోటు మరింత పెరగకుండా..కొన్ని పద్ధతుల్ని అనుసరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక రక్తపోటును నియంత్రించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

దండాసనం ఎలా వేయాలి

అధిక రక్తపోటుకు స్థూలకాయం, ధూమపానం, ఒత్తిడి, ఆందోళన, వంశ చరిత్ర, అనువంశికత, జీవనశైలి కారణాలుగా ఉన్నాయి. దండాసనం యోగా ప్రక్రియ ద్వారా రక్తపోటును నియంత్రించవచ్చు. ఈ ఆసనం కోసం కింద కూర్చుని కాళ్లను ముందుకు చాపాలి. ఆ తరువాత వీపును స్ట్రైట్ చేసి..కాళ్లను ఒకదానికొకటి కలపాలి. ఇప్పుడు తొడలు, మోకాళ్లను కూడా కలపాలి. చేతుల్ని పక్కటెముకలకు ఆన్చాలి.

దండాసనం వల్ల వీపుని బలోపేతం చేయవచ్చు. ఛాతీ, భుజాలను పటిష్టమౌతాయి. బాడీ పోశ్చర్ మెరుగవుతుంది. దిగువ శరీర భాగంలోని మాంసపు కృతులు ఎక్స్‌పాండ్ అవుతాయి. ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అధిక రక్తపోటుకు ఒత్తిడి ఒక కారణంగా ఉంది. 

Also read: Nettle Tea For Weight Loss: పొట్ట సమస్యలేవైనా.. ఈ టీని తాగండి అన్ని దూరమవుతాయి..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News