Beetroot Juice For Control Blood Pressure: దేశవ్యాప్తంగా ప్రతిరోజు వర్షాలు కురుస్తున్నాయి దీనికి కారణంగా వాతావరణం లోని తీమ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఇలాంటి సందర్భాల్లోనే వాతావరణం లో ఉన్న క్రిములు మనుషుల శరీరంలోకి సులభంగా చొచ్చుకు పోతాయి. దీని కారణంగా ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ప్రోటీన్లు విటమిన్లు పుష్కలంగా ఉండే బీట్‌రూట్‌తో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బీట్‌రూట్ తో తయారుచేసిన ఆహారాలను ప్రతిరోజు తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి లోపం సమస్యలను కూడా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ దుంపలో ఉండే పోషకాలు:
బీట్‌రూట్‌లో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిని సలాడ్‌లో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌లో ఫోలేట్ (విటమిన్ B9) పుష్కలంగా ఉంటుంది.. ఇది కణాల పెరుగుదలను మెరుగుపరచడానికి కీలకపాత్ర పోషిస్తుంది.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
బీట్‌రూట్ ప్రయోజనాలు:
✤ బీట్‌రూట్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ప్రతిరోజు దీనితో తయారుచేసిన రసాన్ని తాగడం వల్ల రక్తహీనత, రోగ నిరోధక శక్తి సమస్యలనుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
✤ బీట్‌రూట్‌లో నైట్రేట్ కూడా అధిక మోతాదులో లభిస్తుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడమే కాకుండా శరీరంలో రక్తాన్ని గడ్డకట్టించకుండా నిరోధిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది.
✤ కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే బీట్‌రూట్ శరీరంలో ఎనర్జీ లెవెల్‌ను అభివృద్ధి చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ మొక్కలను కట్ చేసి రసంలో తయారు చేసుకొని తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
✤ బీట్‌రూట్ ఉండే గుణాలు చర్మాన్ని మెరిపించేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే ఫోలేట్, ఫైబర్ చర్మాన్ని మెరుగుపరుస్తాయి. దీని రసాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మొటిమలు తొలగిపోతాయి.
✤ బీట్‌రూట్ నుంచి తీసిన రసాన్ని తాగడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఒత్తిడిని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook