Nita Ambani beauty secret: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సతీమణి.. నీతా అంబానీ..ఒక క్లాసికల్ డాన్సర్ మాత్రమే కాదు. చాలా మంది ఫ్యాషన్ ఐకాన్‌లలో కూడా ఒకరు. డాన్సర్ గా తన టాలెంట్ చాటుకున్న.. నీతా వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా చాలా బాగా వ్యవహరిస్తారు.
60 ఏళ్ల వయసులో కూడా అంతే అందంగా.. అంతే ఫిట్ గా ఉండటం కేవలం నీతా అంబానికే సొంతం. అయితే ఆమె అందం వెనుక సీక్రెట్ చాలా మంది డబ్బు అంటారు. కానీ ఆమె చర్మం యవ్వనంగా.. ఉండటానికి కారణం మంచినీళ్లు.
మంచినీళ్లు అంటే మనం తాగే నీళ్లు కాదండోయ్. నీతా అంబాని తాగేవి ప్రపంచంలోనే ఖరీదైన బంగారు నీళ్లు. మంచినీళ్లలో కూడా బంగారం ఉంటుందా అనుకుంటున్నారా? ఉంటుంది. ఈ ఖరీదైన బంగారు నీళ్లను తాగడం వల్లే నీతా ఇప్పటికీ అందంగా ఉంటారని సమాచారం.
మ్రముఖ మెక్సికన్ డిజైనర్ ఫెర్నాండో ఆల్తామిరానో రూపొందించిన.. ఒక ప్రత్యేకమైన బాటిల్ లో ఈ బంగారు నీళ్లు వస్తాయి. ఇంతకీ ఆ నీళ్ళ పేరు అక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యుటో ఆమోడిగ్లియాని.
ఈ నీళ్ల బాటిల్‌లో ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లతో నిండి ఉంటుందట. ఈ నీళ్లలో 24 క్యారట్ బంగారు కణాలు.. కూడా ఉంటాయి.
ఈ ఖరీదైన నీళ్లు ఫిజీ, ఫ్రాన్స్ నుండి సహజ నీరు, ఐస్లాండ్ నుండి హిమ శీతల.. నీళ్ళ సంగమం. అందులో 23 క్యారట్ ల బంగారు పొడి కూడా ఉంటాయి. ఈ నీటిని తాగితే చర్మం.. పోయిన కాంతిని తెచ్చుకుంటుందట.
ఇక ఈ నీళ్లు ఉండే ఒక్కో బాటిల్ 60,000 USD లో వేలంలో అమ్మబడుతుంది. దీన్ని భారత కరెన్సీకి మారిస్తే, ఇది అక్షరాలా 49 లక్షల రూపాయలు అవుతుంది. అది విన్న నెటిజన్లు.. ఏదేమైనా నీతా అంబానీ అంబాని అందమైన చర్మం వెనుక ఒక ఖరీదైన సీక్రెట్ ఉంది అని అంటున్నారు.
మరోవైపు అంబాని కుటుంబం.. మొత్తం పెళ్లి పనుల్లో.. బిజీగా ఉంది. ముకేష్ అంబానీ కొడుకు అనంత్ అంబాని పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ పెళ్లి కోసం ముకేష్ అంబానీ ఏకంగా 1500 కోట్లు ఖర్చు పెడుతున్నారట.
Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..
Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి