Lakhimpur khiri: రాజకీయ ప్రకంపనలు రేపుతున్న లఖీంపూర్ ఖీరీ, అసలేం జరుగుతోంది

Lakhimpur khiri: లఖీంపూర్ ఖీరీ. దేశం మొత్తం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఓ గ్రామం. రైతుల ఆందోళన..తదనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలు రాజకీయంగా ప్రకంపలు సృష్టిస్తోంది. ఇప్పుడక్కడ రాజకీయ నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 5, 2021, 07:48 AM IST
  • రాజకీయ ప్రకంపనలు రేపుతున్న లఖీంపూర్ ఖీరీ
  • నిరాహార దీక్ష నుంచి వెనక్కి తగ్గవద్దంటూ ప్రియాంకా గాంధీకు రాహుల్ ట్వీట్
  • రాజకీయ నేతల్ని రాష్ట్రంలో ప్రవేశించకుండా అడ్డుకుంటున్న యూపీ పోలీసులు
Lakhimpur khiri: రాజకీయ ప్రకంపనలు రేపుతున్న లఖీంపూర్ ఖీరీ, అసలేం జరుగుతోంది

Lakhimpur khiri: లఖీంపూర్ ఖీరీ. దేశం మొత్తం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఓ గ్రామం. రైతుల ఆందోళన..తదనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలు రాజకీయంగా ప్రకంపలు సృష్టిస్తోంది. ఇప్పుడక్కడ రాజకీయ నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖీరీలో(Lakhimpur Khiri)జరిగిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యల పర్యటన సందర్బంగా రైతుల చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. బన్బీర్‌పూర్‌లో కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్తున్నప్పుడు..నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు (Farmers protest) నల్లజెండాలతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. మంత్రి కాన్వాయ్‌లో రెండు ఎస్ యూవీలు రైతులపై దూసుకెళ్లడంతో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించారు. తదనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మరో ఐదుగురు మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం కల్గించింది. యూపీ నుంచి ఢిల్లీ వరకూ ఆందోళనలకు దారి తీసింది. ప్రతిపక్ష నేతలు, రాజకీయ నాయకులు, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లఖీంపూర్ ఖీరీ వెళ్లే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. రాజకీయనేతల్ని రాష్ట్రంలో అడుగుపెట్టకుండా యూపీ ప్రభుత్వం చర్యలకు దిగింది. ప్రియాంకా గాంధీని అదుపులో తీసుకున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని నిరసిస్తూ పీఏసీ గెస్ట్‌హౌస్‌లో ప్రియాంక గాంధీ(Priyanka gandhi protest)నిరాహార దీక్ష ప్రారంభించారు. ముందు లక్నోలోనే పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచినా..బలవంతంగా అక్కడ్నించి రైతుల వద్దకు బయలుదేరగా..మరోసారి అడ్డుకుని అదుపులో తీసుకున్నారు. పోలీసులు తనను ఉంచిన అతిధి గృహం గదిని చీపురుతో ఊడుస్తూ నిరసన తెలిపారు. ఈ వీడియా ఇప్పుడు వైరల్ అవుతోంది. సోదరి ప్రియాంక వీడియో షేర్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వెనకడుగు వేయవద్దు..ప్రభుత్వం నిన్ను చూసి భయపడుతోందంటూ వ్యాఖ్యలు చేశారు. ఇటు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రాంధ్వా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌లను యూపీ ప్రభుత్వం(Up Government) అనుమతించలేదు. హర్యానా సరిహద్దుల్లోనే రాంధ్వా, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేల కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. 

ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖీరీ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.యూపీలో రామరాజ్యానికి బదులు హంతక రాజ్యం నడుస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని..నియంతృత్వ పాలనే కొనసాగుతోందని విమర్శించారు. రైతుల్ని దారుణంగా చంపేస్తున్నారని..నిజాల్ని బయటకు రాకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. 144 సెక్షన్ లఖీంపూర్ ఖీరీలో కాదని..దేశ ప్రజలే బీజేపీపై సెక్షన్ 144 విధించే రోజు వస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. 

Also read: Lakhimpur Kheri Violence: లఖీంపూర్ ఖేరీ మృతులకు 45 లక్షల పరిహారం, యూపీ ప్రభుత్వ హామీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News