West Bengal Elections: బెంగాల్ ఎన్నికల ప్రచారంలో యోగీ వర్సెస్ నుస్రత్ జహాన్

West Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ ఎంపీ నుస్రత్ జహాన్‌ల వ్యాఖ్యలు హాట్‌హాట్‌గా మారాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2021, 11:20 PM IST
  • పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో వేడెక్కిన రాజకీయాలు
  • మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్
  • యోగీకు దీటుగా సమాధానాలిచ్చేందుకు రంగంలో దిగిన టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్
West Bengal Elections: బెంగాల్ ఎన్నికల ప్రచారంలో యోగీ వర్సెస్ నుస్రత్ జహాన్

West Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ ఎంపీ నుస్రత్ జహాన్‌ల వ్యాఖ్యలు హాట్‌హాట్‌గా మారాయి.

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల( West bengal elections)షెడ్యూల్ విడుదలవడంతో అధికార తృణమూల్ కాంగ్రెస్(TMC), బీజేపీ( BJP)లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బెంగాల్ పీఠంపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను రంగంలో దించింది. ఇప్పటికే యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్( Yogi Adityanath) బెంగాల్‌లోని మాల్దాలో పర్యటించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee) విధానాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో గోవధ, లవ్ జీహాద్‌లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. బెంగాల్‌లో దుర్గా పూజను నిషేధించారని..ఈద్ వస్తే చాలు గోవుల వధ జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో జై శ్రీరామ్ నినాదాన్ని అనుమతించడం లేదని..ప్రజల మనోభావాలతో ప్రభుత్వం అడుకుంటోందని దుయ్యబట్టారు. 

అయితే ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్( Tmc mp Nusrat jahan) రంగంలో దిగారు. సొంత రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టలేని వ్యక్తి పక్క రాష్ట్రాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఘాటుగానే స్పందించారు. బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో జరిగిన ఘోరమైన ఘటనను మాటల్లో వర్ణించలేకపోతున్నానని నుస్రత్ జహాన్ ( Nusrat jahan) ట్వీట్ చేశారు. హత్రాస్ ఘటన ( hathras incident)లో బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రక్షణ ఇవ్వలేకపోయిందని..బీజేపీకు ఆ కుటుంబ ప్రాధాన్యత కంటే బెంగాల్ ఎన్నికలు ముఖ్యమా అని ప్రశ్నించారు. యూపీ హత్రాస్ ఘటనలో బాధితురాలి తండ్రిని నిందితుడు, అతని స్నేహితుడు కలిసి కాల్చి చంపిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం ఈ ఘటనలో అరెస్టైన నిందితుడు గౌరవ్ శర్మ ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. 

Also read: Assam elections: కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే..సీఏఏ నిలిపివేత, 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News