Uttar Pradesh: యోగీ సర్కారు బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు-2024కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. దీంతో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై ఇక మీదట కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Karnataka Corporator Daughter Murder: కాలేజీలో ఒక యువకుడు అమ్మాయిని క్రూరంగా హతమార్చాడు. అందరు చూస్తుండగానే పరిగెత్తించి మరీ 9 సార్లు కత్తితో ఇష్టమోచ్చినట్లు ఆమె మెడపై పొడిచాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Saroor Nagar Honor Killing Updates: సరూర్ నగర్ పరువు హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న హిందూ యువకుడిని చంపిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
West Bengal Elections: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ ఎంపీ నుస్రత్ జహాన్‌ల వ్యాఖ్యలు హాట్‌హాట్‌గా మారాయి.
Love jihad: లవ్ జిహాద్..ఇటీవల చర్చనీయాంశంగా మారిన అంశం. లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం సైతం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లును రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది.
భారత దేశంలో తొలి లవ్ జిహాద్ కేసు బరేలి జిల్లాలో నమోదు అయింది. ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన Prohibition of Unlawful Conversion of Religion Ordinance, 2020 ప్రకారం డియోరానియా పోలీస్టేషన్లో ఆదివారం ఒక కేసు నమోదు చేశారు.
గత రెండు రోజులుగా బాయ్‌కాట్ నెట్ ఫ్లిక్స్ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు కారణం నెట్ ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రసారం అవుతున్న ఏ సూటబుల్ బాయ్ అనే వెబ్ సిరీస్‌లో లవ్ జిహాద్‌ని ప్రోత్సహించేలా పలు బూతు సన్నివేశాలు, కథనాలు ఉన్నాయని ఆరోపణలు రావడమే.
లవ్ జిహాద్ (Love Jihad) వంటి కార్యక్రమాలకు పాల్పడే వారు ఇకనుంచి తమ పద్ధతులు మార్చుకోకుంటే వారికి అంతిమయాత్రేనంటూ ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం (UP) తరహాలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh) సైతం చర్యలకు నడుంబిగించింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో లవ్ జిహాద్ వంటి మతాంతర కార్యకలాపాలను పూర్తిగా నివారించేందుకు యోగి ప్రభుత్వం తీవ్రమైన కసరత్తులు చేపట్టింది. లవ్ జిహాద్‌కు చెక్ పెట్టేందుకు కఠినమైన చట్టాలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తెలిపారు.
ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఒకటి 'లవ్ జిహాద్'కు కౌంటర్ గా 'బేటీ బచావో బహూ లావో' అనే సరికొత్త కార్యక్రమం చేపట్టనుంది. వచ్చేవారమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ఆ సంస్థ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.