కేంద్ర మంత్రి ఆరోగ్యం విషమం.. హుటాహుటిన గోవాకు ఎయిమ్స్ టీమ్

కేంద్ర ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ ఆరోగ్యం ( Shripad Naik health condition ) మరింత క్షీణించడంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి పలువురు వైద్య నిపుణుల బృందం హుటాహుటిన గోవా రాజధాని పనాజికి చేరుకుంది.

Last Updated : Aug 25, 2020, 04:50 AM IST
కేంద్ర మంత్రి ఆరోగ్యం విషమం.. హుటాహుటిన గోవాకు ఎయిమ్స్ టీమ్

పనాజీ: కేంద్ర ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ ఆరోగ్యం ( Shripad Naik health condition ) మరింత క్షీణించడంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి పలువురు వైద్య నిపుణుల బృందం హుటాహుటిన గోవా రాజధాని పనాజికి చేరుకుంది. కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్‌కి ఆక్సిజన్‌ లెవెల్స్‌ ( Oxygen levels ) పడిపోయాయని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ సోమవారం మీడియాకు తెలిపారు. ఆగస్టు 12న జరిగిన కరోనావైరస్ ( Coronavirus ) పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలడంతో ఆగస్టు 14న ఆయన పనాజిలోని ప్రైవేటు మణిపాల్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. Also read : Haryana CM ML Khattar: హర్యానా ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

పనాజికి చేరుకున్న వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్‌కి తాజాగా కరోనా నెగటివ్ అని తేలినప్పటికీ.. మరోసారి కొవిడ్-19 టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. శ్రీపాద్ నాయక్‌కి ప్లాస్మా ( Plasma Therapy ) ఎక్కించినప్పుడు ఆయన శరీరం సరిగానే స్పందించింది అని డాక్టర్లు వెల్లడించారు. Also read : Honey trap: సెక్స్ వర్కర్‌తో ఐఎస్ఐ హనీ ట్రాప్.. ఒకరు అరెస్ట్

Trending News