బడ్జెట్ లో రైతులకు, పేదలకు పెద్దపీట వేసిన జైట్లీ

దేశంలోని పేదల ఆరోగ్యంపై కేంద్రం దృష్టి సారించింది. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రూ.5లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్లు జైట్లీ పార్లమెంట్ లో వెల్లడించారు.

Last Updated : Feb 1, 2018, 01:29 PM IST
బడ్జెట్ లో రైతులకు, పేదలకు పెద్దపీట వేసిన జైట్లీ

పేదలకు రూ.5 లక్షల బీమా

దేశంలోని పేదల ఆరోగ్యంపై కేంద్రం దృష్టి సారించింది. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రూ.5లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్లు జైట్లీ పార్లమెంట్ లో వెల్లడించారు. ఈ పథకం ద్వారా 10 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. 50 కోట్ల మందికి ప్రత్యక్షంగా ఈ పథకం కిందకి వస్తారన్నారు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యే పేదలకు ఐదు లక్షల రూపాయల వరకు బీమా వస్తుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.5లక్షల బీమా వర్తించేలా ఈ పథకం పని చేస్తుందన్నారు.

రైతులకు గిట్టుబాటు ధర పెంపు

పంటలకు ఇచ్చే గిట్టుబాటు ధరను ఒకటిన్నర రెట్లు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. గిట్టుబాటు ధర వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. వ్యవసాయ పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు అధికంగా ఈ మద్దతు ధర ఉంటుందన్నారు. మార్కెట్ ధరలు.. మద్దతు ధరల కంటే తక్కువగా ఉంటే.. ప్రభుత్వమే ఆయా పంటలను కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 11 లక్షల కోట్ల రుణాలను రైతులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మత్స్యకారులు, పశుసంవర్థక రంగాలను బలోపేతం చేసేందుకు రూ.10వేల కోట్లు కేటాయించారు జైట్లీ.

Trending News