Tragedy on Diwali: స్కూటీలో టపాసులు తీసుకెళ్తుండగా భారీ పేలుడు.. తండ్రి, కొడుకు మృతి

దీపావళి పండగ పూట ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.టపాసులు కొనుక్కుని తిరిగొస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో తండ్రీకొడుకులు మృతి చెందారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2021, 04:27 PM IST
  • దీపావళి పండగ వేళ పుదుచ్చేరిలో విషాదం
  • టపాసులు కొనుక్కుని వెళ్తుండగా అకస్మాత్తుగా పేలుడు
  • పేలుడు ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి
  • పేలుడు కారణాలు ఇంకా తెలియరాలేదు
Tragedy on Diwali: స్కూటీలో టపాసులు తీసుకెళ్తుండగా భారీ పేలుడు.. తండ్రి, కొడుకు మృతి

Tragedy on Diwali Father and Son Dies: దీపావళి (Diwali) వేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంటిల్లిపాదీ సంతోషంగా పండగ జరుపుకునేందుకు సిద్దమైన తరుణంలో... అనుకోని ఘటన వారిని శోకసంద్రంలో ముంచెత్తింది. టపాసులు కొనుక్కుని తండ్రి, కొడుకు స్కూటీపై ఇంటికి వెళ్తుండగా ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకుంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పుదుచ్చేరిలోని (Puducherry) విల్లుపురం జిల్లాలో గురువారం(నవంబర్ 4)ఈ ఘటన చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే... కూనిమేడు గ్రామానికి చెందిన కలైనేశన్,అతని ఏడేళ్ల కుమారుడు ప్రదీప్ గురువారం టపాసులు కొనేందుకు బయటకు వెళ్లారు. టపాసులు కొని వాటిని స్కూటీ ముందు భాగంలో పెట్టారు.ఆ టపాసుల పైనే కొడుకుని కూర్చోబెట్టుకుని కలైనేశన్ స్కూటీపై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో కొట్టకుప్పం పట్టణం మీదుగా ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.దీంతో కలైనేశన్,ప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందారు.పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటం వల్లే ఇద్దరు స్పాట్‌లో చనిపోయారు.

Also Read: Ravi Teja New Movie: జోరు చూపిస్తున్న మాస్ మహారాజ్ రవితేజ.. మరో కొత్త సినిమా ప్రకటన

ఆ సమయంలో అటుగా వెళ్తున్న రెండు బైక్స్,ఒక లారీ కూడా ధ్వంసమయ్యాయి.పేలుడు దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.పేలుడుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.పేలుడు ఘటన గురించి తెలియగానే కలైనేశన్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.టపాసులు కొనుక్కుని త్వరగానే వచ్చేస్తామని చెప్పినవాళ్లు... అనంత లోకాలకు వెళ్లిపోవడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News