Supreme court on group 1 Exams: తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్ఠుల పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు విచారించింది. గ్రూప్ 1 అభ్యర్థుల తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు విన్పించారు. తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవో నంబర్ 29 ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులు పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం.. ఈ సమయంలో జోక్యం చేసుకొలేమని స్పష్టం చేసింది. హైకోర్టులో కేసు పెండింలో ఉన్న నేపథ్యంలో అక్కడకు వెళ్లాలని చెప్పినట్లు తెలుస్తొంది.
జీవో నంబర్ 55 నే ఈ ఎగ్జామ్లలో అమలు చేయాలన్న కూడా రేవంత్ సర్కారు పట్టించుకోవట్లేదని గ్రూప్ 1 అభ్యర్టులు పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తొంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు డీవై చంద్రచూడ్ ధర్మాసనం నిరాకరించినట్లు తెలుస్తొంది. ఇవాల్టి నుంచి ఈనెల 27వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మధ్యాహ్నం 1.30 నిముషాల నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ లు యథాతథంగా జరగనున్నట్లు తెలుస్తొంది.
పరీక్షల కోసం భారీ ఏర్పాట్లు..
సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ సర్కారు బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకొవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం.. టీజీపీఎస్సీ పూర్తి ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలుస్తొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.