Supreme Court on Maharashtra: మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వ పతనం, బీజేపీ మద్దతుతో షిండే వర్గం పగ్గాలు చేపట్టడం వంటి పరిణామాలు సుప్రీంకోర్టు వరకూ చేరాయి. షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
గత ఏడాది మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. ఆ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ఏక్నాథ్ షిండే నేతృత్వంలో 15 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు వహించడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఆ పరిస్థితుల్లో బల నిరూపణ పరీక్షకు వెళ్లకుండానే థాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఏక్నాథ్ షిండే వర్గం బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. షిండే సహా 15మందిపై అనర్హత వేటు వేయాల్సిన అంశాన్ని స్పీకర్ పట్టించుకోకపోవడంతో థాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది.
నాడు జరిగిన ఘటనలో థాక్రే వర్గం చేసిన చిన్న పొరపాటు ఇవాళ సుప్రీంకోర్టులో అతనికి అనుకూలంగా తీర్పు వచ్చేందుకు అడ్డంకిగా మారింది. నాడు రాజీనామా చేయకపోయుంటే..ఇవాళ ప్రభుత్వాన్ని పునరుద్ధరించి ఉండేవాళ్లమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుుడున్న పరిస్థితుల్లో థాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని చెప్పింది. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చాలా వరకూ థాక్రే వర్గానికి అనుకూలంగానే వెల్లడయ్యాయి.
విప్ నియమించాల్సింది రాజకీయ పార్టీనే కానీ, శాసనసభా పక్షం కాదని, ఏక్నాథ్ షిండే క్యాంప్ నియమించిన విప్ చెల్లుబాటు కాదని ఆ సమయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైందికాదని కోర్టు అభిప్రాయపడింది. ఓ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలను బల నిరూపణ పరీక్ష పరిష్కరించలేదని కోర్టు తెలిపింది.
ఆ సమయంలో థాక్రే పార్టీ మెజార్టీ కోల్పోయిందనే సమాచారం గవర్నర్ వద్ద లేకపోయినా బల నిరూపణకు ఆదేశించడం తప్పని కోర్టు స్పష్టం చేసింది. అది గవర్నర్ రాజకీయ జోక్యాన్ని, తొందరపాటు నిర్ణయాన్ని సూచిస్తుందని కోర్టు వివరించింది. అయికే బల నిరూపణకు వెళ్లకుండా ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయడంతో ఇవాళ థాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించమని ఆదేశించలేమంది కోర్టు.
సుప్రీంకోర్టు తీర్పుపై అటు థాక్రే ఇటు షిండేలు వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పుని తమ నైతిక విజయంగా ఉద్ధవ్ థాక్రే అభివర్ణించారు. ఏ మాత్రం నైతిక విలువలున్నా తక్షణం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని కోరారు. మరోవైపు సుప్రీంతీర్పు తమకు అనుకూలంగా ఉందని షిండే వర్గం ప్రకటించుకుంది.
Also read: Supreme Court: ఢిల్లీ ప్రభుత్వానిదే అధికారం, కేంద్రానికి కాదంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook