Supreme Court Judges: ఇద్దరు జడ్జిలకు సుప్రీం కోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఎందుకంటే..

Supreme Court Judges: సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్‌తో కలిపి మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం వారిలో కేవలం 27 మంది మాత్రమే సేవలు అందిస్తుండగా మరో ఏడుగురి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడం కోసమే ప్రస్తుతం దేశంలోని అన్ని హై కోర్టుల నుంచి అర్హత కలిగిన న్యాయమూర్తుల వడపోత జరుగుతోంది. ఈ జాబితాలోంచే తాజాగా సుప్రీం కోర్టు కొలిజియం రాజేష్ బిందాల్, అరవింద్ కుమార్ పేర్లను ఖరారు చేస్తున్నట్టు స్పష్టంచేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2023, 11:21 PM IST
Supreme Court Judges: ఇద్దరు జడ్జిలకు సుప్రీం కోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఎందుకంటే..

Supreme Court Judges: సుప్రీం కోర్టులో ఖాళీగా ఉన్న జడ్జిల స్థానాలను భర్తీ చేసే విషయంలో సుప్రీం కోర్టు కొలిజియం కీలక నిర్ణయం తీసుకుంది. అలహాబాద్ హై కోర్టు చీఫ్ జస్టిస్ రాజేష్ బిందాల్, గుజరాత్ హై కోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ పేర్లను ఖరారు చేసిన  సుప్రీం కోర్టు కొలిజియం.. తమ నిర్ణయానికి గల కారణాలను కూడా వెల్లడించింది. జస్టిస్ రాజేష్ బిందాల్ ఎంపిక విషయంలో  సుప్రీం కోర్టు కొలిజియంలోని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఆరుగురు జడ్జిలు ఏకాభిప్రాయంతో ఉండగా.. అరవింద్ కుమార్ ఎంపిక విషయంలోనే ఆరుగురు జడ్జిలు ఉన్న కొలిజియంలో ఒకరైన కే.ఎం. జోసెఫ్ తన అభిప్రాయాన్ని రిజర్వ్ లో ఉంచుతూ అరవింద్ కుమార్ పేరును తరువాతి దశలో పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా అభిప్రాయపడ్డారు. దీంతో ఒక రకంగా జస్టిస్ రాజేష్ బిందాల్ ఎంపికకు లైన్ క్లియర్ అయినప్పటికీ.. జస్టిస్ అరవింద్ కుమార్ విషయంలోనే ఊగిసలాట తప్పడం లేదు. 

సుప్రీం కోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య..
సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్‌తో కలిపి మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం వారిలో కేవలం 27 మంది మాత్రమే సేవలు అందిస్తుండగా మరో ఏడుగురి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడం కోసమే ప్రస్తుతం దేశంలోని అన్ని హై కోర్టుల నుంచి అర్హత కలిగిన న్యాయమూర్తుల వడపోత జరుగుతోంది. ఇందులో భాగంగానే డిసెంబర్ 13న ఒక నోటిఫికేషన్ విడుదల చేసిన సుప్రీం కోర్టు కొలిజియం.. అందులో ఐదుగురి పేర్లను ఎంపిక ప్రక్రియకు పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఆ తరువాత తాజా నోటిఫికేషన్ ద్వారా మరో ఇద్దరు న్యాయమూర్తుల పేర్లను వెల్లడించింది. ఈ జాబితాలోంచే తాజాగా సుప్రీం కోర్టు కొలిజియం రాజేష్ బిందాల్, అరవింద్ కుమార్ పేర్లను ఖరారు చేస్తున్నట్టు స్పష్టంచేసింది.

సుప్రీం కోర్టుకు న్యాయమూర్తుల ఎంపిక విషయంలో సుప్రీం కోర్టు కొలీజియం పరిగణలోకి తీసుకున్న అంశాలు ఏంటంటే..
పేరెంట్ హైకోర్టులో సీనియారిటీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హై కోర్టుల్లో ఎవరికి ఎక్కువ సీనియారిటీ ఉందో వారికే తొలి ప్రాధాన్యత ఒక ప్రాతిపదికగా తీసుకుంటున్నట్టు సుప్రీం కోర్టు కొలిజియం స్పష్టంచేసింది.
హై కోర్టుల్లోని న్యాయమూర్తుల మెరిట్, పర్‌ఫార్మెన్స్, సమగ్రత వంటి అంశాలు.
సుప్రీం కోర్టులో వివిధ రాష్ట్రాల హై కోర్టుల ప్రాతినిథ్యాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకోనున్నట్టు సుప్రీం కోర్టు కొలిజియం వెల్లడించింది. సుప్రీం కోర్టు కొలిజియం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు ప్రాతినిథ్యం లేని హై కోర్టులు లేదా ఉండాల్సిన స్థాయిలో ప్రాతినిథ్యం లేని హై కోర్టులకు ప్రాధాన్యత ఉంటుంది.      
లింగ బేధాలు లేకుండా సమ న్యాయం మరో ప్రాతిపదిక.
మైనారిటీల ప్రాతినిథ్యానికి తగిన ప్రాధాన్యత.

సుప్రీం కోర్టు కొలిజియంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ధనుంజయ్ వై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కే.ఎం. జోసెఫ్, జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు. సుప్రీం కోర్టుకు నియమితులయ్యే జడ్జిల పేర్లను సుప్రీం కోర్టు కొలిజియం ఎంపిక చేసి ప్రభుత్వానికి తమ సిఫార్సుగా పంపిస్తుందనే సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి : Tata Nexon, Maruti Fronx: టాటా నెక్సాన్‌కి మారుతి ఫ్రాంక్స్ షాక్ ఇవ్వనుందా ? తక్కువ ధరలోనే SUV Car ?

ఇది కూడా చదవండి : Honda Activa as EV: హోండా యాక్టివా స్కూటీని ఎలక్ట్రిక్ స్కూటీ చేసేశాడు.. మాడిఫికేషన్ ఖర్చు, మైలేజ్ రేంజ్ ఎంతో తెలుసా ?

ఇది కూడా చదవండి : OPPO Reno 8T 5G: అద్దిరిపోయే ఫీచర్స్‌తో ఒప్పో రెనో 8T 5G వచ్చేస్తోంది.. లాంచింగ్ డేట్ ఇదిగో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News