రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక : బీజేపీ, కాంగ్రెస్ పోరులో గెలిచేదెవరు ?

                                                          

Last Updated : Aug 9, 2018, 05:40 PM IST
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక : బీజేపీ, కాంగ్రెస్ పోరులో గెలిచేదెవరు ?

మరికాసేపట్లో డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన రంగం సిద్ధమైంది. ఈ ఉత్కంఠ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి... విపక్ష పార్టీల ఐక్యత రాగం కలిసి వస్తుందా...మోడీ - షా చాణిక్య నీతి ఫలిస్తుందా...ప్రత్యర్ధిని చిత్తు చేయాలని వేసిన ప్లాన్ లో నెగ్గేదెవరు...ప్రాంతీయ పార్టీలు బీజేపీకి మద్దతుగా నిలుస్తాయా...మోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ విపక్షాలను ఏకతాటిపై తీసుకురాగలదా ? రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో ఏం జరుగుతుంది ?  ఈ ప్రశ్నలకు సమధానం మరికాసేపట్లో రానుంది. రాజ్యసభ  డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో దీనిపై ప్రత్యేక కథనం..

రెండున్నర దతాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత..

రెండున్నత దశాబ్దాల తర్వాత పెద్దల సభలో డిప్యూటీ సీఎం ఎన్నిక జరగుతుంది. 1992లో నెజ్మా హెప్తుల్తాకు వ్యతిరేకంగా టీడీపీ రేణుకా చౌదరీ పోటీ చేశారు. అప్పుడు నెజ్మా హెప్తుల్లాకు అనుకూలంగా 128 ఓట్లు రాగా వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. అప్పుటి ఎన్నికల్లో గెలుపొందిన నజ్మా హెప్తుల్లా 2004 వరకు డిప్యూటీ చైర్మన్ గా కొనసాగారు. అనంతరం 2004 లో రెహ్మాన్ ఖాన్..2012లో కురియన్ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . అయితే తన పదవికాలం ముగియడంతో జూలై 1న కురియన్ పదవీ వివరణ చేశారు. దీంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది

సాంప్రదాయబద్దంగా డిప్యూటీ ఛైర్మన్  ఎన్నిక  ఏకగ్రీవం ఎన్నకుందామని ప్రధాని మోడీ పిలుపునివ్వగా.. అందుకు విపక్షాలు సానుకులంగా స్పందించలేదు. బీజేపీ అభ్యర్ధిపై పోటీగా తమ అభ్యర్ధిని నిలుపుతామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీయే నుంచి జేడీయూ ఎంపీ హరివంశ్ బచ్చన్ నామినేషస్ వేయగా.. కాంగ్రెస్ నుంచి బీకే హరి ప్రసాద్ బరిలోకి దిగారు

ఓటింగ్ తీరు ఇలా..

ఈ రోజు 11 గంటలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయ నాయుడు  డిప్యూటీ చైర్మన్ పదవికి ఎవరైతే నామినేషన్ వేశారో వారి పేరు చదువుతారు. ఆ తర్వాత ఎన్నిక జరుపుతారు.. అనుకూలంగా ఎన్ని ఓట్లు వచ్చాయో.. వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు వచ్చారో లెక్కిస్తారు. ఓటింగ్ పాల్గొన్న వారిలో సగానికి పైగా ఎంపీలు మద్దతు తెలిపితే తొలుత నామినేషన్ వేసిన అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తారు. తొలి తీర్మానం ఓడిపోతేనే రెండవ తీర్మాన చదువుతారు. వాస్తవానికి తొలి నామినేషన్ ఎన్డీయే అభ్యర్ధి హరివంశ్ బచ్చన్ వేశారు. అంటే తొలుత ఈయన పేరు చదివే అవకాశముంది. ఒక వేళ ఆయన ఓడిపోతే కాంగ్రెస్ అభ్యర్ధి ప్రసాద్ పేరు చదువుతారు

కీలకంగా మారిన ప్రాంతీయ పార్టీలు
రాజ్యసభలో ప్రస్తుతం 244 మంది సభ్యులు ఉన్నారు. డిప్యూటీ చైర్మన్ పదవి గెలుచుకోవడానికి 123 సభ్యుల బలం అవసరం. బీజేపీ, కాంగ్రెస్ లకు ఈ స్థాయిలో బలం లేకపోవడంతో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారాయి. దీంతో బీజేపీ తమ అభ్యర్ధిని కాకుండా జేడీయుకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ తొలుత విపక్షాలకు అవకాశం ఇస్తామని చెప్పినప్పటికీ చివరి నిమిషంలో తన వ్యూహం మార్చి తమ అభ్యర్ధినే బరిలోకి దించింది

సభలో బీజేపీ,కాంగ్రెస్ కు సమాన బలం

ఇక బలాబలాలను పరిశీలించినట్లయితే.. పెద్దల సభలో బీజేపీ 74, కాంగ్రెస్ కు 50 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అన్నాడీఎంకేకి 13, ఎస్పీకి 13, టీఎంసీకి 13, బీజేడీకి 9, జేడీయుకి 6, టీడీపీకి 6 టీఆర్ఎస్ 6, డీఎంకే 4, బీఎస్పీ 4,ఎన్సీపీ 4. శివసేన 3 అకాలీదళ్ 3 ఆప్ 3 , వైసీపీ, సీపీఐ,పీడీపీలకు చెరో రెండు 2 సీట్లు చొప్పున ఉన్నాయి. ఇతర చిన్న పార్టీ (జేడీఎస్, కేరళ కాంగ్రెస్ మణి ఐఎన్ఎల్ డీ , బీపీఎఫ్,ఎస్ డీఎఫ్, ఎన్ పీఎఫ్, ఆర్ పీఐ, ఐయుఎంయు )లకు తలో ఒకరు చొప్పున ఉన్నారు.

అన్నాడీఎంకే , జేడీయూ, అకాలిదళ్ , నామినేటెడ్, స్వతంత్రులను కలుపుకొని బీజేపీ బలం 110కి చేరింది. టీఆర్ఎస్, బీజేడీ పార్టీలకు నితీష్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఎన్డీయే అభ్యర్ధి హరివంశ్ కే మద్దుతు తెలిపే అవకాశం ఉంది. దీనికి తోడు ఆరుగురు స్వతంత్రులు, నలుగురు నామినేడెట్ సభ్యుల మద్దతు ఉంది. ఈ లెక్కన చూస్తే బీజేపీ కూటమి బలం 125కి పెరిగింది

తృణమూల్,ఎస్పీలతో కలిసి కాంగ్రెస్ కూటమి బలం 111కి చేరింది. టీడీపీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ బలం 117కి చేరింది. ప్రత్యేక హోదా విషయంలో విఫలమైనందున  బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైసీపీ నిర్ణయించడంతో  కాంగ్రెస్ బలం 119కి పెరిగింది. 

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఎన్డీయేకే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. మద్దతిస్తామని మాట ఇచ్చిన ప్రాంతీయ పార్టీలన్నీ చెప్పినట్లుగానే ఓటు వేస్తాయా..లేదంటే చివరి క్షణంలో మనసు మార్చుకుంటాయా అనే దానిపై ఉత్కంఠత నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ పోరులో గెలిచే దెవరు ఈ ప్రశ్నలకు మరి కాసేపట్లు సమాధానం రానుంది.
 

Trending News