Republic Day 2025: 76వ గణతంత్య్ర వేడుకలు ఢిల్లీలో కర్తవ్య పథ్ లో జరగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, లోక్ సభ స్పీకర్, హోం, రక్షణ సహా కేంద్ర క్యాబినేట్ మంత్రులతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు హాజరయ్యారు. వేడుకలను సజావుగా జరిగేలా ఎర్రకోట చుట్టూ వెయ్యికి పైగా సీసీటీవీ కెమెరాలు, నగర ప్రజల అవసరార్థం అంతటా 35 హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. నగరం చుట్టూ దాదాపు 15వెల మంది పోలీసులు మోహరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రోబోవో సుబియాంటో భారత పర్యటనపై గతంలోనే ఉత్కంఠ నెలకొంది. ప్రోబోవో సుబియాంటో భారత్‌లో పర్యటించిన తర్వాత పాకిస్థాన్ వెళ్లాలనుకున్నారు. ఈ కారణంగా, భారతదేశం ముఖ్య అతిథి పేరును ప్రకటించడంలో ఆలస్యం చేసింది. ప్రోబోవో సుబియాంటో తన భారత పర్యటన తర్వాత నేరుగా పాకిస్థాన్‌కు వెళ్లాలని అనుకున్నారు. అందుకు భారత్ దౌత్య నీతి ప్రదర్శించడంతో సుబియాంటో పాకిస్థాన్ పర్యటన రద్దు చేసుకున్నారు.
మొదట తన భారత పర్యటనను పాక్ పర్యటనతో అనుసంధానం చేయాలనుకున్నారు. అప్పుడు భారతదేశం తన దౌత్యం అద్భుతాలను చూపించింది. దౌత్య మార్గాల ద్వారా ఇండోనేషియాతో భారత్ ఈ విషయాన్ని లేవనెత్తింది. భారత్ తన ఏ కార్యక్రమంలోనూ పాక్ బంధాన్ని కోరుకోవడం లేదని ఆయనకు వివరించి కన్విన్స్ చేసింది. దీంతో భారత పర్యటన అనంతరం నేరుగా మలేషియా వెళ్లనున్నారు. అక్కడ అతను యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్ సుల్తాన్ ఇబ్రహీం, ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంలను కలుస్తారు.
సుబియాంటో పర్యటన సందర్భంగా, పలు రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు రెండు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే నాల్గవ ఇండోనేషియా అధ్యక్షుడు ఆయన కావడం విశేషం. 1950లో భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్ణో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇండోనేషియా నుండి 352 మంది సభ్యుల కవాతు మరియు బ్యాండ్ బృందం ఇక్కడి డ్యూటీ లైన్‌లో రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంది.
విదేశాల్లో జరిగే నేషనల్ డే పరేడ్‌లో ఇండోనేషియా కవాతు, బ్యాండ్ స్క్వాడ్‌లు పాల్గొనడం ఇదే మొదటిసారి. గత కొన్నేళ్లుగా భారత్-ఇండోనేషియా సంబంధాలు బలపడ్డాయి. ప్రధాని మోదీ 2018లో ఇండోనేషియాను సందర్శించారు. ఆ సమయంలో భారత్-ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి చేరుకున్నాయి.
గతేడాది నవంబర్ 19న రియో డి జెనీరోలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో సమావేశమయ్యారు. భారత్ – ఇండోనేషియా ఒక సహస్రాబ్ది కంటే ఎక్కువ కాలం నాటి సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలతో సన్నిహిత సముద్ర పొరుగు దేశాలుగా కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.