Republic Day 2023: భారత దేశంలో మొదటి 'రిపబ్లిక్ డే' ఎక్కడ జరిగిందో తెలుసా?.. రాజ్‌పథ్‌లో మాత్రం కాదు!

Why Do We Celebrate Republic Day on 26th January Every Year. 1947 స్వాతంత్రం తర్వాత 'గణతంత్ర దేశం'గా 1950 జనవరి 26న భారత దేశం అవతరించింది. అదే 'రిపబ్లిక్ డే'.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 18, 2023, 10:04 PM IST
  • మొదటి 'రిపబ్లిక్ డే' ఎక్కడ జరిగిందో తెలుసా?
  • రాజ్‌పథ్‌లో మాత్రం కాదు
  • గణతంత్ర దినోత్సవం అంటే
Republic Day 2023: భారత దేశంలో మొదటి 'రిపబ్లిక్ డే' ఎక్కడ జరిగిందో తెలుసా?.. రాజ్‌పథ్‌లో మాత్రం కాదు!

Republic Day History, Significance And Interesting Facts: భారత దేశానికి వ్యాపారం కోసం వచ్చిన ఆంగ్లేయులు.. నాటి పరిస్థితులను, అనైక్యతను ఆసరగా చేసుకుని క్రమంగా పట్టుసాధించారు. రాజ్యాలు, సంస్థాలుగా ఉన్న దేశాన్ని.. 'విభజించు పాలించు' విధానంతో హస్తగతం చేసుకున్నారు. 200 ఏళ్ల పాటు ఆంగ్లేయులు పాలనలో భారతీయులు ఏన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో ప్రాణ త్యాగాలు, సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించింది. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది. 

1947 స్వాతంత్రం తర్వాత 'గణతంత్ర దేశం'గా 1950 జనవరి 26న భారత దేశం అవతరించింది. అదే 'రిపబ్లిక్ డే' (Republic Day 2023). భారత దేశం నుంచి ఆంగ్లేయులను వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఓ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. భారత రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఎంతో మంది మేధావులు, ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. పలు రకాల అంశాలతో చాలా కాలం పాటు రాజ్యాంగ ఏర్పాటుకు కృషి చేసి రూపొందించారు. 1950 జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడింది. డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా.. భారతదేశం పూర్తి గణతంత్ర దేశంగా మారింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా 'ప్రజా ప్రభుత్వం'గా రూపుదిద్దుకుంది.

అయితే జనవరి 26 ప్రాముఖ్యత తెలియని వారు ప్రస్తుత రోజుల్లో ఎందరో ఉన్నారు. జనవరి 26ను సాధారణ సెలవు రోజు అని అనుకుంటారు. ఇంటి పట్టున ఉంటూ సరదాగా కాలక్షేపం చేస్తారు. దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారిని ఎంతమంది స్మరిస్తున్నారు?. జాతీయ సెలవు రోజున ఎంత మంది వారి ఆదర్శాలను గుర్తుచేసుకుంటారు. నేటి యువతకి జనవరి 26కు ఉన్న ప్రాముఖ్యతపై ఎంత అవగాహన ఉంది అంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇక చాలా మందికి మొదటి గణతంత్ర దినోత్సవం ఎక్కడ జరిగిందనే విషయం కూడా తెలియదు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

అందరూ అనుకున్నట్టు తొలి గణతంత్ర దినోత్సవం రాజ్‌పథ్‌లో జరగలేదు. ఇర్విన్ స్టేడియం (ధ్యాన్ చంద్ స్టేడియం)లో జరిగిందట. అప్పటికి సరిహద్దు గోడ నిర్మించబడలేదట. మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉదయం కాకుండా మధ్యాహ్నం జరుపుకున్నారట. మన దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఆరు గుర్రాల బగ్గీలో బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పుడు 31 ఫిరంగులతో వందనం ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. 

Also Read: Baleno Second Hand Cars: 4.5 లక్షలకే మారుతీ సుజుకి బాలెనో.. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే!

Also Read: Hyundai Micro SUV: హ్యుందాయ్ నుంచి చౌకైన ఎస్‌యూవీ.. టాటా పంచ్‌కి ఇక చుక్కలే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News