RBI Instructions to Loan Recovery Agents: ఇటీవలి కాలంలో రుణాల వసూలుకు లోన్ రికవరీ ఏజెంట్స్ కస్టమర్స్‌ను తీవ్రంగా వేధిస్తున్న ఘటనలు చాలానే వెలుగుచూశాయి. కస్టమర్స్‌కు ఏ టైమ్‌లో పడితే ఆ టైమ్‌లో ఫోన్ చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి ఘటనలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో లోన్ రికవరీ ఏజెంట్స్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్ని కమర్షియల్ బ్యాంకులు, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్.. ఇలా ఆర్బీఐ నియంత్రణలోని ప్రతీ సంస్థ ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా మార్గదర్శకాల ప్రకారం... లోన్ రికవరీ ఏజెంట్స్ రుణ గ్రహీతలకు ఉదయం 8 గంటల కన్నా ముందు, సాయంత్రం 7 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ కాల్స్ చేయకూడదు. నోటికి పనిచెప్పడం ద్వారా కానీ లేదా భౌతికంగా కానీ కస్టమర్స్‌ను ఎటువంటి ఇబ్బందులకు గురిచేయవద్దు. అలాగే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అసభ్యకర సందేశాలు వారికి పంపించవద్దు. ఈ మేరకు ఆయా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు లోన్ రికవరీ ఏజెంట్లను అదుపులో పెట్టుకోవాలి. రుణ గ్రహీతలకు వారి నుంచి ఎటువంటి వేధింపులు ఎదురవకుండా చూసుకోవాలి.
లోన్ రికవరీ ఏజెంట్స్ ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆర్బీఐ పేర్కొంది. ఇటీవలి కాలంలో పలు సంస్థల ఆమోదయోగ్యం కాని పోకడలను, సంఘటనలను ఆర్బీఐ పరిశీలించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు లోన్ రికవరీ ఏజెంట్స్‌ను అదుపులో పెట్టుకునేలా తాజా మార్గదర్శకాలు విడుదలచేసింది.
Also Read: IND vs PAK: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్.. విజేత ఎవరో చెప్పేసిన రికీ పాంటింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook