Ram mandir: భూమి పూజ తొలి ఆహ్వానం అందుకుంటున్న ఇక్బాల్ ఎవరు ?

Ram mandir bhoomi pujan: న్యూ ఢిల్లీ: అయోధ్య రామజన్మ భూమిలో రామ మందిరం నిర్మాణం కోసం జరగనున్న భూమి పూజ కార్యక్రమం కోసం ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలావుండగా తాజాగా ఈ వేడుకకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అదేమంటే రామ మందిరం భూమి పూజ కోసం ఇచ్చే తొలి ఆహ్వానం ఎవరికి అనే విషయం.

Last Updated : Aug 4, 2020, 10:15 AM IST
Ram mandir: భూమి పూజ తొలి ఆహ్వానం అందుకుంటున్న ఇక్బాల్ ఎవరు ?

Ram mandir bhoomi pujan: న్యూ ఢిల్లీ: అయోధ్య రామజన్మ భూమిలో రామ మందిరం నిర్మాణం కోసం ఆగస్టు 5న అంగరంగ వైభవంగా భూమి పూజ కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇదిలావుండగా తాజాగా ఈ వేడుకకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అదేమంటే రామ మందిరం భూమి పూజ కోసం ఇచ్చే తొలి ఆహ్వానం ఎవరికి అనే విషయం.

Also read: Ram temple: భూమి పూజకు 1,11,000 లడ్డూల తయారీ

Bhoomi pujan first invitation: తొలి ఆహ్వానం ఎవరికి ? 
రామ జన్మభూమి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన తొలి ఆహ్వానం బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి ( Iqbal Ansari ) ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. అయోధ్య రామజన్మభూమిలో రామ మందిరం నిర్మించతలపెట్టిన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్లు ఇక్బాల్ అన్సారీకి తొలి ఆహ్వానాన్ని పంపించినట్టు తెలుస్తోంది. Also read: Ram Temple: రామ మందిరం భూమి పూజకు అతిథుల జాబితా ఇదే

Who is Iqbal Ansari ఇక్బాల్  అన్సారీ ఎవరు ?
రామ జన్మభూమి- బాబ్రి మసీదు స్థల వివాదంపై ముస్లింల తరపున బలమైన వాదన వినిపించిన వారిలో ఇక్బాల్ అన్సారీ కూడా ఒకరు. ఇక్బాల్ అన్సారీ తండ్రి హషీమ్ అన్సారీ కూడా బాబ్రీ మసీదు కోసమే న్యాయపోరాటం చేసి తన 96 ఏళ్ల వయస్సులో 2016లో చనిపోయారు. ఆ తర్వాత హషీమ్ అన్సారీ వారసుడు ఇక్బాల్ అన్సారీ ఆ బాధ్యతను తీసుకుని బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం జరిపారు. Also read: Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కి మరో గుడ్ న్యూస్ రానుందా ?

ఇక్బాల్ అన్సారీ స్పందన ఏంటి ?
రామ మందిరం నిర్మాణం భూమి పూజ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ తనకు ఆహ్వానం అందడంపై ఇక్బాల్ అన్సారీ స్పందించారు. తనకు తొలి ఆహ్వానం అందాలన్నది సాక్షాత్తూ ఆ శ్రీ రాముడి ఆకాంక్షే అనుకుంటున్నాను అని అన్నారు. అందుకే ఈ ఆహ్వానాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను అని చెప్పిన అన్సారీ.. ఈ కార్యక్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రామనామం రాసి ఉన్న రాయిని అందజేస్తానని తెలిపారు. తాను అయోధ్య వాసినే. కోర్టు తీర్పుతో అయోధ్య స్థల వివాదం ముగిసిపోయింది కనుక ఇక ఆలయ నిర్మాణంతో ఈ ప్రాంతం దశ మారుతుందని, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాం అని అన్నారు. Also read: Dogs: కరోనాను శునకాలు పసిగడతాయా ?

Trending News