/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

న్యూ ఢిల్లీ: ఆత్మ నిర్భర్ ప్యాకేజీ ( Atma nirbhar package ) పేరుతో ప్రధాని మోదీ సర్కార్ ( PM Modi govt ) ప్రవేశపెట్టిన రూ .20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ( Rs 20 lakh crore package ), ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( FM Nirmala Sitharaman ) ఐదు రోజులపాటు ఆ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు వెల్లడించడాన్ని దేశంపై ఓ కృూరమైన జోక్‌గా ( Cruel joke ) కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ( Sonia Gandhi ) అభివర్ణించారు. కరోనావైరస్‌ని నియంత్రించడానికి కేంద్రం విధించిన లాక్ డౌన్లపై సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఆమె కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీకి భావసారుప్యం ఉన్న 22 పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయని తెలుస్తోంది. Temperature updates : ఎండలతో హీటెక్కిన ఢిల్లీ.. తెలంగాణ, ఏపీలోనూ మండుటెండలు )

ఈ సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహం లేకుండా లాక్ డౌన్ విధించిందని... అలాగే ఆ లాక్ డౌన్‌ను కొనసాగించిందని సోనియా గాంధీ ఆరోపించారు. మార్చి 24 న కేవలం 4 గంటల ముందస్తు నోటీసుతో లాక్ డౌన్ విధించినప్పుడు కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నాయని ప్రకటించిన సందర్భాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. "21 రోజుల్లో వైరస్ కు వ్యతిరేకంగా యుద్ధం ముగుస్తుందని ప్రారంభ దశలో ప్రధాని వేసిన అంచనా నిజం కాలేదని" అని అన్నారామె. ప్రధాని మోదీ సర్కార్ మన దేశ రాజ్యాంగంలో ఓ భాగమైన ఫెడరలిజం స్పూర్తిని మరచిపోయిందని ఆమె కేంద్రంపై మండిపడ్డారు. దేశంలోని అధికారం అంతా ఇప్పుడు ఒక్క ప్రధాని కార్యాలయంలోనే కేంద్రీకృతమై ఉందని సోనియా గాంధీ ఎద్దేవా చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Section: 
English Title: 
PM Narendra Modi's Rs 20 lakh crore Atma nirbhar package is cruel joke : Sonia Gandhi
News Source: 
Home Title: 

Sonia Gandhi : 20 లక్షల కోట్లు ఓ కృూరమైన జోక్ : సోనియా గాంధీ

20 లక్షల కోట్లు ఓ కృూరమైన జోక్ : సోనియా గాంధీ
Caption: 
IANS photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Sonia Gandhi : 20 లక్షల కోట్లు ఓ కృూరమైన జోక్ : సోనియా గాంధీ
Publish Later: 
Yes
Publish At: 
Friday, May 22, 2020 - 18:42