BJP VS TRS: టీఆర్ఎస్ ఫ్లైక్సీ రాజకీయంపై ప్రధాని మోడీ ఫైర్.. కేసీఆర్ కు ఇక చుక్కలేనా?

BJP VS TRS:  తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతుండగా.. ఆ సమయంలో రాజకీయ కార్యక్రమాలు పెట్టారు కేసీఆర్.సీఎం కేసీఆర్ తీరుపై బీజేపీ జాతీయ నేతలు ఆరా తీశారని తెలుస్తోంది. ఫ్లెక్సీల రాజకీయం ప్రధాని మోడీ దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు

Written by - Srisailam | Last Updated : Jul 3, 2022, 10:41 AM IST
  • బండి సంజయ్ తో మోడీ డిన్నర్ మీటింగ్
  • టీఆర్ఎస్ ఫ్లైక్సీ రాజకీయంపై ఆరా
  • కేసీఆర్ కు చుక్కలు చూపించనున్న బీజేపీ
BJP VS TRS: టీఆర్ఎస్ ఫ్లైక్సీ రాజకీయంపై ప్రధాని మోడీ ఫైర్.. కేసీఆర్ కు ఇక చుక్కలేనా?

BJP VS TRS: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతుండగా.. ఆ సమయంలో రాజకీయ కార్యక్రమాలు పెట్టారు కేసీఆర్. హైదరాబాద్ లో బీజేపీ ధీటుగా ప్రభుత్వ ప్రకటనలతో ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టారు. టీఆర్ఎస్ జెండాలు కట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చిన అవమానించేలా వ్యవరిస్తున్నారు కేసీఆర్. ఇటీవల కాలంలో మోడీ రెండు సార్లు హైదరాబాద్ వచ్చారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రిసీవ్ చేసుకోలేదు. మోడీ పర్యటనకు దూరంగా ఉన్నారు. బీజేపీ జాతీయ సమావేశాల కోసం వచ్చిన ప్రధానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో స్వాగతం చెప్పించారు కేసీఆర్. అదే సమయంలో విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రచారం కోసం వస్తే స్వయంగా బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం చెప్పారు. కేసీఆర్ తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై బీజేపీ జాతీయ నేతలు ఆరా తీశారని తెలుస్తోంది. ఫ్లెక్సీల రాజకీయం ప్రధాని మోడీ దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు. బీజేపీ సమావేశాల రోజున కావాలనే  యశ్వంత్ సిన్హాను రప్పించి కేసీఆర్ హడావుడి చేశారనే భావనలో ఉన్న బీజేపీ జాతీయ నేతలు.. కేసీఆర్ తగిన బుద్ది చెప్పాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. శనివారం రాత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ తో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా డిన్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరుపైనే ప్రధానంగా చర్చ జరిగిందని తెలుస్తోంది. టీఆర్ఎస్ వ్యవహారం రెచ్చగొట్టేలా ఉందనే అభిప్రాయానికి వచ్చిన బీజేపీ అగ్ర నేతలు.. ఇకపై కేసీఆర్ పట్ల మరింత సీరియస్ గా ముందుకు వెళ్లాలని నిర్ణయించారని సమాచారం. మోడీ, అమిత్ షాతో చర్చల తర్వాత మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. కేసీఆర్ కు ఇక చుక్కలేనంటూ మాట్లాడం సంచలనంగా మారింది.

ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా టిఆర్ఎస్ అధినేత పారిపోతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌  అన్నారు. ‘పులి వస్తే నక్కలు పారిపోతాయని’ అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ఎందుకు పారిపోతున్నాడు, ఎందుకు భయపడుతున్నారని సంజయ్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ దుష్పరిపాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు.తెలంగాణ ప్రజలు మార్పు కోసం చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు. కరెంటు బిల్లులు, బస్సు చార్జీలు, ఆస్తిపన్ను పెంచి ప్రజలంపై భారం మోపిన నయా నిజాం పాలనను అంతం చేస్తామని హెచ్చరించారు. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సంజయ్ జోస్యం చెప్పారు. ప్రధాని మోడీని స్వాగతించకుండా కేసీఆర్ వ్యక్తిని కాదు, సంస్థను అవమానించారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం చెప్పడం ఆనవాయితీగా వస్తుందన్నారు.  రాజ్యాంగబద్ధ ఫెడరల్ ప్రోటోకాల్‌ను కేసీఆర్ భంగపరిచారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Covid Cases: దేశంలో పెరుగుతున్న కొవిడ్ మరణాలు.. తమళనాడులో కల్లోలం  

Read also: MP Raghurama Raju: పారిస్ నుంచి తిరిగొచ్చిన సీఎం జగన్.. రేపు భీమవరంలో ఎంపీ రఘురామ రాజుతో కలిసి మీటింగ్

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News