మోదీ ఫిలిప్పీన్స్ పర్యటన

Last Updated : Nov 12, 2017, 12:03 PM IST
మోదీ ఫిలిప్పీన్స్ పర్యటన

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఫిలిప్పీన్స్ కు బయలుదేరి వెళ్లారు. ఆయన మూడు రోజులపాటు ఫిలిప్పీన్స్ లో పర్యటించనున్నారు. ఈమేరకు పీఎంవో కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఇండియన్‌-ఏసియన్‌’ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఫిలిప్పైన్స్‌ వెళ్లనున్నారు. మూడు రోజుల ఈ అధికారిక పర్యటనలో మోదీ 'ఇండియన్‌-ఏసియన్‌' సదస్సు, తూర్పు ఆసియా సదస్సు, ఏసియన్‌ బిజినెస్‌ అండ్‌ ఇన్వెస్ట్ మెంట్‌ సదస్సుల్లో పాల్గొంటారు. వీటితో పాటు ‘ఏసియన్‌’ 50వ వార్షికోత్సవాలకు హాజరవుతారు. అక్కడ వివిధ దేశఅధ్యక్షులతో భేటీ అవుతారు. మహావీర్‌ ఫిలిప్పైన్స్‌ ఫౌండేషన్‌, అంతర్జాతీయ రైస్‌ పరిశోధన కేంద్రాన్ని మోదీ సందర్శిస్తారు. మోదీ తన పర్యటనలో భాగంగా అక్కడ సందర్శిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యే అవకాశం లేకపోలేదు. బహుశా భేటీలో భారత్ ను సందర్శించమని ఆహ్వానించవచ్చు.

Trending News