PM Modi cabinet expansion: కేంద్ర కేబినెట్‌లో కొత్త మహిళా కేంద్ర మంత్రులు వీళ్లే

PM Modi new cabinet ministers: న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ విస్తరణలో భాగంగా కేబినెట్‌లోకి కొత్తగా ఇంకొంత మంది మహిళా మంత్రులు వచ్చిచేరారు. కొత్తగా ఏడుగురు మహిళలకు ప్రధాని మోదీ నూతన కేబినెట్‌లో చోటు దక్కింది. కేబినెట్ విస్తరణలో అవకాశం దక్కించుకున్న మహిళల (List of women ministers in PM Modi's new cabinet) వివరాలు ఓసారి పరిశీలిద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2021, 09:05 PM IST
PM Modi cabinet expansion: కేంద్ర కేబినెట్‌లో కొత్త మహిళా కేంద్ర మంత్రులు వీళ్లే

PM Modi new cabinet ministers: న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ విస్తరణలో భాగంగా కేబినెట్‌లోకి కొత్తగా ఇంకొంత మంది మహిళా మంత్రులు వచ్చిచేరారు. కొత్తగా ఏడుగురు మహిళలకు ప్రధాని మోదీ నూతన కేబినెట్‌లో చోటు దక్కింది. కేబినెట్ విస్తరణలో అవకాశం దక్కించుకున్న మహిళల వివరాలు (List of women ministers in PM Modi's new cabinet) ఓసారి పరిశీలిద్దాం.

Who is Meenakshi Lekhi - మీనాక్షి లేఖి : 
ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపి నాయకురాలు మీనాక్షి లేఖికి మోదీ కేబినెట్‌లో అవకాశం లభించింది. న్యాయవాదిగా, ఒక సామాజిక కార్యకర్తగా అందరికీ సుపరిచితురాలైన మీనాక్షి లేఖి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగానూ సేవలు అందించారు. జాతీయ మహిళా కమిషన్, బాలలు, మహిళల హక్కుల పరిరక్షణకు మీనాక్షి లేఖి కృషిచేశారు. 

Who is Shobha Karandlaje - శోభ కరంద్లాజే :
శోభ కరంద్లాజే కర్ణాటకలోని ఉడుపి చిక్‌మగళూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. కర్ణాటక రాజకీయాల్లో మహిళా ఫైర్ బ్రాండ్ లీడర్‌గా శోభ కరంద్లాజేకు పేరు ఉంది. కర్ణాటక సీఎం యెడ్యూరప్పకు (CM Yediyurappa) లాయలిస్టుగానూ పేరున్న శోభ.. 2012లో కర్ణాటక జనతా పార్టీలో Karnataka Janata Party (KJP) చేరేందుకు యెడియూరప్పను అనుసరించిన వారిలో ముందు వరుసలో ఉన్నారు. 

Also read : Kishan Reddy: పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ, కిషన్ రెడ్డికి ప్రమోషన్

Who is Annapurna devi - అన్నపూర్ణ దేవి :
బీజేపీ ఎంపీ అన్నపూర్ణ దేవి జార్ఖండ్‌లోని కొడెర్మా లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. 2019 నుంచి మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. విద్యుత్తు మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలో కూడా అన్నపూర్ణా దేవి సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 

Who is Anupriya singh patel - అనుప్రియ సింగ్ పటేల్ :
అనుప్రియ పటేల్ ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన అప్నాదళ్ (ఎస్) పార్టీ తరపున గెలిచారు. అప్నా దళ్ పార్టీ స్థాపకుడు, బహుజన్ సమాజ్ పార్టీకి సహ వ్యవస్థాపకుడు అయిన దివంగత నేత డాక్టర్ సోనే లాల్ పటేల్ కుమార్తెనే ఈ అనుప్రియ పటేల్.

Who is Dr Bharati Pravin Pawar - డా భారతి ప్రవీణ్ పవార్ :
మహారాష్ట్రలోని డిండోరి (ఎస్‌టీ) నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ డా భారతి ప్రవీణ్ పవార్ నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. Also read: 
Karnataka: కావేరి నదిపై ప్రాజెక్టును అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు 

Who is Pratima Bhoumik - ప్రతిమ భౌమిక్ :
ప్రతిమ భౌమిక్ త్రిపుర (తూర్పు) లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. రైల్వే మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా ప్రతిమ భౌమిక్ సేవలు అందిస్తున్నారు.

Who is Darshana Vikram Jardosh - దర్శన విక్రమ్ జర్దోశ్ :
సూరత్ ఎంపీ దర్శన విక్రమ్ జర్దోశ్ 2019 నుంచి ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగానూ సేవలు అందిస్తున్నారు.

కేంద్ర కేబినెట్‌ విస్తరణలో (PM Modi's new cabinet ministers) కొత్తగా కొందరికి అవకాశం లభించగా.. ఇప్పటికే కేబినెట్‌లో కొనసాగుతున్న సహాయ మంత్రులకు ప్రమోషన్ లభించింది.

Also read: Delta Variant Cases: ఇండియాలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, కోవిడ్19 మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News