COVID19 Guidelines: కొవిడ్ రూల్స్​ పాటించని వారిపై చర్యలు- ఒక్క రోజే రూ.కోటి ఫైన్లు!

COVID19 Guidelines: న్యూ ఇయర్ వేడుకల్లో కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు చేపట్టారు ఢిల్లీ పోలీసులు. జనవరి 1న భారీగా జరిమానాలు విధించడం సహా.. ఎఫ్​ఐఆర్​లు కూడా నమోదు చేశారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2022, 12:46 PM IST
  • కరోనా రూల్స్​ పాటించని వారిపై ఢిల్లీ పోలీసుల చర్యలు
  • జనవరి 1న 66 ఎఫ్​ఐఆర్​లు నమోదు
  • ఒక్క రోజులోనే రూ.99 లక్షల ఫైన్లు
COVID19 Guidelines: కొవిడ్ రూల్స్​ పాటించని వారిపై చర్యలు- ఒక్క రోజే రూ.కోటి ఫైన్లు!

COVID19 Guidelines: కరోనా కల్లోలం మధ్యే మరో ఏడాది ముగిసింది. కొవిడ్ భయాల నేపథ్యంలో కఠిన ఆంక్షల మధ్యే న్యూ ఇయర్ వేడుకలు (New Year 2022) జరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం (Ban on New Year Celebrations) విధించగా.. కొన్ని రాష్ట్రాలు మాత్రం కఠిన ఆంక్షలు విధిస్తూనే సెలెబ్రేషన్స్​కు అనుమతినిచ్చాయి.

ప్రభుత్వం, పోలీసుల ఆంక్షల నేపథ్యంలో చాలా మంది నిరాడంబరంగా వేడుకలు జరుపుకున్నారు. కొంత మంది మాత్రం అనుమతి లేకున్నా.. ఆంక్షలను (Covid restriction in Delhi) పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. అయితే అలాంటి వారందరిపై ముందుగా హెచ్చరించినట్లుగానే.. చర్యలకు దిగారు పోలీసులు.

ఢిల్లీలో రూ.కోటి ఫైన్లు..

కొవిడ్ నిబంధనలు ఉల్లఘించిన కారణంగా ఢిల్లీ పోలీసులు రూ.99 లక్షలకుపైగా ఫైన్లు వేశారు. ఆంక్షలను పట్టించుకోకుండా (Fines on violation of COVID19 protocols) వ్యవహరించిన 66 మందిపై ఎఫ్​ఐఆర్​ కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ మొత్తం 2022 జనవరి 1కి సంబంధించినవేనని వివరించారు.

దేశంలో కరోనా కేసులు భారీగా (Corona fears) పెరుగుతుండటం, ఒమిక్రాన్​ భయాల (Omicron scare in India) నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆంక్షలను విధించగా.. అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకున్నారు.

దీనితో పాటు కొవిడ్ నిబంధనలు పాటించని  రెండు మద్యం షాపులపై కూడా చర్యలు తీసకున్నారు. ఓ షాప్​పై రూ.10 వేలు, మరో షాప్​పై రూ.20 వేలు జరిమానా విధించారు.

తమ షాప్​ల ముందు జనాలు గుమిగూడినా సిబ్బంది వారిని హెచ్చరించలేదని.. అందుకే ఫైన్​ వేసినట్లు పోలీసులు తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్​లో సైతం డిసెంబర్ 31న ఒక్క రోజులోనే 3 వేలకు పైగా డ్రంక్​ అండ్ డ్రైవ్​ కేసులు నమోదు చేశారు పోలీసులు.

Also read: Corona cases in India: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 27,553 కేసులు నమోదు

Also read: CDS Bipin Rawat: హెలికాప్టర్​ ప్రమాదంపై విచారణ పూర్తి- వచ్చే వారమే తుది నివేదిక!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News