కరోనా వైరస్ ( Corona virus) రోజురోజుకీ ఉధృతమవుతోంది. వైరస్ సంక్రమణ ధర్డ్ స్టేజ్ లో విజంభిస్తుందనడానికి నిదర్శనం తమిళనాడులో ( Tamilnadu) జరిగిన ఆ సంఘటన. ఒక్కడి కారణంగా ఎందరో జీవితాలు కరోనా బారిన పడ్డాయి. ఇప్పుడిదే తమినాడులో ఆందోళనకు కారణమవుతోంది. అధికారులు తలలు పట్టుకుంటున్నారు ఏం చేయాలో తోచక. అసలేం జరిగింది.
కోవిడ్ 19 వైరస్ ( covid19 virus).. ఎవర్నించి ఎప్పుడు ఎలా వ్యాపిస్తుందో తెలియని విచిత్రమైన పరిస్థితి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్నాయి. తమిళనాట పరిస్థితి మరీ చేయి దాటుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ లక్షా 14 వేల 78 కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై ( Chennai corona cases ) లోనే 70 వేల కేసులున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తమినాడు తిరుచ్చి ( Tiruchi) లో వెలుగు చూసిన ఓ ఘటన అందర్నీ ఆందోళన కల్గిస్తోంది. Also read: Sumalatha Ambareesh: సుమలతకు కరోనావైరస్ పాజిటీవ్
తిరుచ్చిలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్ ( Nethaji Subhash chandrabose road) లో ఓ నగల దుకాణంలో పని చేసే వ్యక్తి కారణంగా ఏకంగా 104 మందికి కరోనా వైరస్ సోకినట్టు అధికార్లు నిర్ధారించడంతో అందరూ అవాక్కయ్యారు. జూన్ 22న ఈ వ్యక్తికి కరోనా సోకినట్టు తేలింది. ఈ వ్యక్తితో కాంటాక్ట్ లో ఉన్న కుటుంబసభ్యులు, స్టోర్ లోని మిగిలిన సిబ్బందికి కోవిడ్ 19 నిర్దారణ పరీక్షలు నిర్వహించగా….104 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వీరంతా తురైయూర్ ( Turaiyur) ఇతర ప్రాంతాల్నించి వచ్చినవారని తెలుస్తోంది. కేవలం 13 రోజుల వ్యవధిలో తురైయూర్ పరిధిలోని రెండు గ్రామాల్లో కరోనా కేసులు పదిరెట్టు పెరిగాయి. జూన్ 22 వరకూ పది కేసులుండగా...ఇప్పుడా సంఖ్య 108కు చేరుకుంది. నలుగురు మినహా మిగిలినవారంతా ఆ నగల దుకాణంలో పనిచేసేవారే కావడం గమనార్హం. నగల దుకాణంలో తొలి కేసు నమోదు కాగానే మిగిలినవారిని హోమ్ క్వారంటైన్ (Home Quarantine) కు తరలించకుండా పని చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. Also read: TTD: తిరుమల దేవస్థానం సిబ్బందికి కరోనా: దర్శనాలకు బ్రేక్ ?
ఈ ఘటనతో అప్రమత్తమైన జిల్లా యంత్రాగం ఎస్ ఎస్ బీ రోడ్ లోని అన్ని దుకాణాల్ని రెండు వారాల పాటు మూసివేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని రెడ్ స్పాట్ గా ప్రకటించింది.
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..