Odisha Lockdown: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించగా, ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కొన్ని పరిమితులతో కూడిన లాక్‌డౌన్ విధిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు లాక్‌డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో రెండు వారాలపాటు కీలకమైన లాక్‌డౌన్ విధించారు. ఆ లాక్‌డౌన్ మే 5వ తేదీ నుంచి 19వ తేదీవరకు రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉండనుంది. ఇందుకుగానూ కొన్ని ఆంక్షలు, షరతులు విధిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇంటి నుంచి నిత్యావసర సరుకుల కోసం కేవలం 500 మీటర్ల వరకు మాత్రమే వెళ్లాలని సూచించింది. కరోనా వైరస్(CoronaVirus) వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వర్తకులు తమ దుకాణాలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం 5 గంటలపాటు మాత్రమే తెరిచి ఉంచాలని స్పష్టం చేసింది.
Also Read: Risk Factors For Covid-19: కరోనా వీరికి సోకితే మరింత ప్రమాదకరం.. ప్రాణాలు కూడా పోతాయి
కరోనా పాజిటివ్ కేసులు, కోవిడ్19(COVID-19) మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తోంది. మరికొన్ని రాష్ట్రాలు వారాంతపు లాక్‌డౌన్ విధిస్తుండగా, తెలంగాణ, ఏపీ లాంటి రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ విధించి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటుండగా.. ఒడిశాలోని నవీన్ పట్నాయక్ సర్కార్ మాత్రం 2 వారాల పాటు లాక్‌డౌన్ విధించింది. ఒడిశాలో రోజుకు 8 వేల కరోనా కేసులు నమోదవుతుండగా, ఆదివారం ఒక్కరోజు 14 మందిని కరోనా బలితీసుకుంది.
Also Read: Anchor Pradeep: కరోనాతో యాంకర్ ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు కన్నుమూత
కాగా, గత 24 గంటల్లో దేశంలో 3 లక్షల 92 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 3 వేల 689 మంది ప్రాణాలు కోల్పోయారు. 3 లక్షల మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 33 లక్షల 49 వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో 15 కోట్ల 68 లక్షల మంది టీకాలు తీసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Odisha Lockdown: రెండు వారాలపాటు లాక్‌డౌన్ విధిస్తూ ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం
దేశ వ్యాప్తంగా భారీగా పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాలు
కేసుల తీవ్రత నేపథ్యంలో ఒడిశాలో 2 వారాలపాటు లాక్‌డౌన్ విధింపు
మే 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు