NEET PG 2021 Exam Postponed: కరోనా ఎఫెక్ట్, నీట్ పీజీ పరీక్షలు 4 నెలలపాటు వాయిదా

NEET PG 2021 Exam Postponed: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ గెస్ట్ (NEET PG 2021 Exam)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పీజీ 2021 పరీక్షల్ని దాదాపు నాలుగు నెలలపాటు వాయిదా వేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 3, 2021, 05:53 PM IST
  • కరోనా సెకండ్ వేవ్‌లో ప్రతిరోజూ దాదాపు 4 లక్షల కేసులు
  • NEET PG 2021 Examపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
  • నీట్ పీజీ 2021 పరీక్షల్ని దాదాపు నాలుగు నెలలపాటు వాయిదా
NEET PG 2021 Exam Postponed: కరోనా ఎఫెక్ట్, నీట్ పీజీ పరీక్షలు 4 నెలలపాటు వాయిదా

NEET PG 2021 Exam : భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో ప్రతిరోజూ దాదాపు 4 లక్షల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు 10వ తరగతి, ఇంటర్ బోర్డ్ పరీక్షలు రద్దు చేశాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షల్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ గెస్ట్ (NEET PG 2021 Exam)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

నీట్ పీజీ 2021 పరీక్షల్ని దాదాపు నాలుగు నెలలపాటు వాయిదా వేశారు. ఈ ఏడాది ఆగస్ట్‌ 31 వరకు పరీక్షలు నిర్వహించలేమని, పరీక్ష(NEET PG 2021) తేదీలను ఆ గడువు ముగిసిన అనంతరం చర్చించి నిర్ణయిం తీసుకుంటామని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. వైద్య సిబ్బంది, డాక్టర్లు కరోనా విధులు నిర్వహించేందుకు అవకాశం లభిస్తుందని తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల సేవల్ని కరోనా బాధితులకు టెలీకన్షల్టేషన్ అండ్ సూపర్‌విజన్ కోసం వినియోగించుకోనున్నట్లు స్పష్టం చేశారు. 

Also Read: Covid-19 Vaccine తీసుకున్నాక మూర్ఛ, స్పృహ తప్పడానికి కారణమేంటో చెప్పిన సీడీసీ

ప్రస్తుతం కరోనా నియంత్రణకు సాధ్యమైనంత వైద్య సిబ్బంది అవసరమని, అందుకోసం బీఎస్సీ, జీఎన్ఎం నర్సులు పూర్తి సమయం కోవిడ్(COVID-19) నర్సింగ్ డ్యూటీ నిర్వహిస్తారని చెప్పారు. సీనియర్ డాక్టర్లు, నర్సుల సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రాక్టిస్ లభిస్తుందన్నారు. ప్రధాన మంత్రి తాజాగా నిర్ణయంతో మెడిసిన్ విద్యార్థుల పీజీ బ్యాచ్ ప్రారంభానికి ముందు వారు కోవిడ్19 పేషెంట్లకు సేవలు అందించనున్నారు. అనంతరం నీట్ పీజీ 2021 పరీక్షలకు హాజరవుతారు.

Also Read: Chiranjeevi: కరోనాపై పోరాటం, నలుగురి ప్రాణాలు కాపాడాలని ప్రజలకు చిరంజీవి విజ్ఞప్తి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News