Sharad Pawar: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో తేడా వస్తోందా..ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వైఖరి దీనికి కారణంగా తెలుస్తోంది. మొన్న ప్రధానితో భేటీ..ఇవాళ అమిత్ షాతో సమావేశం దేనికి సంకేతమనే చర్చ ప్రారంభమైంది.
మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ(Shivsena-Ncp-Congress) నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం నడుస్తోంది. గత కొద్దికాలంగా సంకీర్ణ ప్రభుత్వంలో చీలికలు తలెత్తాయనే వార్తలు ఎక్కువౌతున్నాయి. ఇటు ఎన్సీపీ నేత శరద్ పవార్ వైఖరి దీనికి కారణంగా తెలుస్తోంది. వరుసగా ఎన్డీఏ పెద్దల్ని కలవడం సందేహాలకు దారి తీస్తోంది. సరిగ్గా రెండు వారాల క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన శరద్ పవార్..ఇప్పుడు అమిత్ షాతో(Amit shah) సమావేశం జరపడం వెనుక కారణాలేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని(Maharashtra) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమిలో చీలికలు తలెత్తాయనే వాదన బలపడుతోంది. శరద్ పవార్(Sharad pawar)ఎన్డీఏకు చేరువవుతున్నారనే సమాచారం విన్పిస్తోంది.
శరద్ పవార్ ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari)ని కూడా కలిశారని సమాచారముంది. ఇంకొందరైతే శరద్ పవార్ రాష్ట్రపతి రేసులో ఉన్నారని..అందుకే ఎన్డీఏ(NDA) నేతల్ని కలుస్తున్నారని అంటున్నారు. అయితే శరద్ పవార్ ఈ వాదనను ఖండించారు. 2024లో ప్రధాని పీఠం అధిరోహించాలనే ధ్యేయంతోనే శరద్ పవార్..ఇతర పార్టీ నేతలతో కలుస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్( Prashant kishor)సైతం శరద్ పవార్‌తో రెండుసార్లు భేటీ అయిన పరిస్థితి ఉంది.
Also read: కొత్తగా 7 ఆధునిక కోర్సుల్ని తయారు చేసిన ఐఐటీ రూర్కి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook