Nagaland: నాగాలాండ్‌లో మెరుపు ధర్నా-వేలాదిగా వీధుల్లోకి పోటెత్తిన జనం...

Massive Protests in Nagaland: నాగాలాండ్‌లో ఇటీవల సాధారణ పౌరులపై ఆర్మీ కాల్పుల (Firing in Nagaland) ఘటన అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తిస్తోంది. నిన్న, మొన్నటివరకూ మొన్ జిల్లాకే పరిమితమైన ఆందోళనలు తాజాగా నాగాలాండ్ రాజధాని కోహిమాకు విస్తరించాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 04:45 PM IST
  • నాగా రాజధాని కోహిమాలో భారీ నిరసన
  • మెరుపు ధర్నా చేపట్టిన స్టూడెంట్స్ ఫెడరేషన్
  • వేలాదిగా వీధుల్లోకి వచ్చిన నాగా ప్రజలు
  • ఇటీవల సాధారణ పౌరులపై కాల్పులకు వ్యతిరేకంగా
Nagaland: నాగాలాండ్‌లో మెరుపు ధర్నా-వేలాదిగా వీధుల్లోకి పోటెత్తిన జనం...

Massive Protests in Nagaland: నాగాలాండ్‌లో ఇటీవల సాధారణ పౌరులపై ఆర్మీ కాల్పుల (Firing in Nagaland) ఘటన అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తిస్తోంది. నిన్న, మొన్నటివరకూ మొన్ జిల్లాకే పరిమితమైన ఆందోళనలు తాజాగా నాగాలాండ్ రాజధాని కోహిమాకు విస్తరించాయి. కోహిమా కేంద్రంగా నాగాలాండ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (NSF) మెరుపు ధర్నా చేపట్టింది. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

చేతుల్లో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. 'సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) రద్దుకు ముందు.. ఇంకెన్ని బుల్లెట్లు దింపుతారు...' అని ప్లకార్డుల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోహిమాలో వరుసగా మూడు రోజుల నుంచి నిరసన ప్రదర్శనలు చేపడుతూనే ఉన్నారు. ఇప్పటికే నాగాలాండ్‌కి చెందిన కోన్యక్ యూనియన్, ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ENPO) ఆర్మీకి సహాయ నిరాకరణ ప్రకటించాయి. అంతేకాదు, ఇకనుంచి ఏ జాతీయ వేడుకల్లోనూ పాల్గొనబోమని... తమ ప్రాంతంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్లను అనుమతించేది లేదని ప్రకటించాయి.

నాగాలాండ్‌లోని పలు జిల్లాల్లో గురువారం (డిసెంబర్ 16) బంద్ (Protests in Nagaland) జరిగింది. మొన్ జిల్లాతో పాటు కిఫిరే, నోక్లక్, లాంగ్‌లెంగ్ జిల్లాల్లో స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, షాపులను మూసేశారు. నిరసన ప్రదర్శనల కారణంగా పలుచోట్ల ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. సాధారణ పౌరులపై కాల్పులు జరిపిన ఆర్మీ జవాన్లను వెంటనే అరెస్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 6న లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ట్రక్కును ఆపాల్సిందిగా ఆర్మీ జవాన్లు కోరినప్పటికీ.. అది ముందుకు దూసుకెళ్లడంతో... ఉగ్రవాదులుగా పొరబడి కాల్పులు జరిపారని అమిత్ షా చేసిన ప్రకటనను నాగా ప్రజలు ఖండిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసిన నిరసన తెలియజేశారు. సాయుధ బలగాల ప్రత్యేక చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని అక్కడి ప్రజలు పట్టుబడుతున్నారు. నాగాలాండ్ (Nagaland Firing incident) సీఎం నీఫియు రియో, మేఘాలయ సీఎం సంగ్మా సైతం ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో ఈ చట్టం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ అక్కడి ప్రజల నుంచి చాలా కాలంగా వినిపిస్తోంది.

Also Read :Omicron: చాప కింద నీరులా ఒమిక్రాన్... ఢిల్లీలో కొత్తగా మరో 10 కేసులు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News