Maharashtra: కంగనాకు విమర్శలకు సమాధానమిచ్చిన ఉద్ధవ్ థాకరే

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వ్యాఖ్యలపై ఎట్టకేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందించారు. దసరా ర్యాలీ సందర్భంగా పరోక్షంగా ఆమె కామెంట్లకు దీటైన సమాధానమిచ్చారు.

Last Updated : Oct 26, 2020, 06:00 PM IST
Maharashtra: కంగనాకు విమర్శలకు సమాధానమిచ్చిన ఉద్ధవ్ థాకరే

బాలీవుడ్  ( Bollywood ) ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ( Kangana Ranaut ) వ్యాఖ్యలపై ఎట్టకేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ( Maharashtra cm Uddhav thackeray ) స్పందించారు. దసరా ర్యాలీ సందర్భంగా పరోక్షంగా ఆమె కామెంట్లకు దీటైన సమాధానమిచ్చారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) మరణం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్  కంగనా రనౌత్  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కూడా టార్గెట్ చేసింది. ముఖ్యమంత్రి కుమారుడు ఆదిత్య ధాకరేపై ఆరోపణలు చేయడం, ముంబాయిని పీవోకేతో పోల్చడం, మహారాష్ట్ర పోలీసుల్ని బాబర్ సేనగా వ్యాఖ్యానించడం ఇలా వరుసగా టార్గెట్ చేస్తూ వచ్చింది కంగనా రనౌత్.  అయితే ఆమె ఎన్ని వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నా మౌనం దాల్చిన ముఖ్యమంత్రి ఎట్టకేలకు నోరు విప్పారు. శివసేన పార్టీ నిర్వహించిన దసరా ర్యాలీ సందర్భంగా కంగానా వ్యాఖ్యలకు దీటైన సమాధానమిచ్చారు. 

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణం కేసులో  కుమారుడు ఆదిత్య థాకరేపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటే, బిహార్‌ పుత్రుడు బలవన్మరణం చెందాడని ప్రచారం చేశారంటూ ఎద్దేవా చేశారు. అలాగే కొంతమంది మహారాష్ట్ర బిడ్డలను, ముఖ్యంగా తన కుమారుడు ఆదిత్యను కూడా దుర్భాషలాడారని ఆరోపించారు. కానీ తాము మాత్రం ఎలాంటి కళంకం లేకుండా ఉన్నామని స్పష్టం చేశారు. న్యాయం తమవైపే ఉందని ఉద్ధవ్ థాకరే తెలిపారు.

ముఖ్యంగా బతుకు దెరువు కోసం ముంబైకి వచ్చిన కొంతమంది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ( POK ) అంటూ ముంబై నగరా్ని అప్రతిష్ట పాలు  జేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. ఇంట్లో తాము తులసి మొక్కలు పెంచుతాం గానీ గంజాయి కాదని స్పష్టం చేశారు. ఈ విషయం వారికి తెలియదంటూ విమర్శించారు. గంజాయి క్షేత్రాలు వాళ్ల రాష్ట్రంలోనే ఉన్నాయని అన్నారు. సొంత రాష్ట్రంలో తిండికి గతి లేక ఇక్కడికొచ్చి డబ్బులు సంపాదించుకుని ముంబైని పీవోకేతో పోల్చి పరువు తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మక ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పారు. 

ముంబైైపై ఆమె చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం పెల్లుబికింది. శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్  ( Shiv sena mp sanjay raut ) కంగనాపై మండిపడ్డారు. ముంబై పీవోకే అయినప్పుడు..సొంతరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కు పోవాలంటూ సూచించారు. అక్రమ నిర్మాణమంటూ ముంబైలోని కంగనా ఆఫీసును బీఎంసీ ( BMC ) కూల్చివేసినప్పటి నుంచి ఆరోపణలు తీవ్రమయ్యాయి. తన ఆఫీసు కూల్చివేతకు నిరసనగా..2 కోట్ల పరిహారం చెల్లించాలంటూ కంగనా ముంబైయి హైకోర్టును ఆశ్రయించింది.  Also read: Bihar elections: ఎల్జేపీ అధికారంలోకి వస్తే నితీశ్ జైలుకే: చిరాగ్ పాశ్వాన్

Trending News