ముంబై: మహారాష్ట్రలోని దివ్యాంగులకు పర్యావరణ స్నేహపూర్వక వాహనాలను అందించి, వారు సొంతంగా మొబైల్ వాహనాల దుకాణాలు నడుపుకునేందుకు వీలుగా వారికి రూ.3.75 లక్షల ఆర్థిక సహాయం అందజేసేందుకు ఆ రాష్ట్ర సర్కార్ ముందుకొచ్చింది. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2018-19 బడ్జెట్‌లోనే ఈ పథకానికి స్థానం కల్పించగా తాజాగా భేటీ అయిన కేబినెట్.. రూ.20 కోట్ల నిధులతో ఈ పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది.
అయితే ఈ మొత్తాన్ని ఉచిత ఆర్థిక సహాయం కింద అందిస్తుందా లేక రుణం కిందనా అనేది తెలియాల్సి ఉంది.