International flights: అంతర్జాతీయ విమాన సేవలపై కేంద్రం తాజా నిర్ణయం

International flights services latest updates: న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమాన సేవల నిలిపివేతను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, చత్తీస్‌ఘడ్, తమిళనాడు రాష్ట్రాల్లో మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 cases) భారీగా పెరుగుతున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2021, 09:17 PM IST
  • International flights services నిలిపివేత ఏప్రిల్ 30 వరకు పొడిగింపు.
  • కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధం.
  • మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, చత్తీస్‌ఘడ్, తమిళనాడు రాష్ట్రాల్లో మరోసారి విజృంభిస్తున్న Coronavirus.
International flights: అంతర్జాతీయ విమాన సేవలపై కేంద్రం తాజా నిర్ణయం

International flights services latest updates: న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమాన సేవల నిలిపివేతను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకటించింది. ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసిన పలు మార్గాల్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌కు అనుమతి కల్పించే అవకాశం ఉందని డీజీసీఏ తమ ప్రకటనలో పేర్కొంది. కార్గొ విమానాలకు ఈ నిషేధం వర్తించదని కేంద్రం తేల్చిచెప్పింది. 

Also read : COVID-19 in Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
 
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను భారత్‌కి తీసుకొచ్చేందుకు వందే భారత్ మిషన్‌లో భాగంగా ప్రత్యేక విమానాలను (Special flights) నడిపిన కేంద్రం.. ఆ తర్వాత ఎయిర్ బబుల్ (Air Bubble) పేరుతో ఎంపిక చేసిన దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే. 

మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, చత్తీస్‌ఘడ్, తమిళనాడు రాష్ట్రాల్లో మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 cases) భారీగా పెరుగుతున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News