రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీ పాలసీ రేట్లను పెంచుతున్నట్టు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రెపో రేటు 25 బెసిస్ పాయింట్స్ పెంచడంతో ప్రస్తుతం రెపో రేటు 6.25 శాతానికి చేరింది. అలాగే రివర్స్ రెపో రేటును సైతం 6 శాతానికి పెంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. 2014 జనవరి తర్వాత గత నాలుగేళ్లలో ఆర్బీఐ రెపో రేటు పెంచడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై బుధవారం సమావేశమై చర్చించిన మానిటరీ పాలసీ కమిటీ ఈ రెపో రేట్లను పెంచాలనే నిర్ణయం తీసుకుంది. కమిటీ తీసుకున్న ఈ నిర్ణయానికి కమిటీలోని ఆరుగురు సభ్యులు తమ మద్దతు తెలియజేస్తున్నట్టు ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు.
పెరిగిన రెపో రేటు కారణంగా ఇకపై రుణాల వడ్డీ రేట్లు సైతం అంతేవిధంగా పెరగనున్నాయి. ఇది రుణగ్రహీతలపై కొంత అదనపు ఆర్థిక భారాన్ని వేయనుంది.